రాత్రి 7 గంటల లోపు డిన్నర్ చేస్తే ఏమౌతుందో తెలుసా?
చాలా మందికి రాత్రి 9 నుంచి 10 గంటలకు తినే అలవాటు ఉంటుంది. కానీ ఇంత లేట్ గా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీరు గనుక రాత్రి 7 లోపు భోజనం చేసేస్తే మాత్రం ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం వరకు.. టైం ప్రకారం తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదంటారు ఆరోగ్య నిపుణులు. అవును రోజూ ఒక నిర్ధిష్ట సమయానికి తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమే ఉండదు. ముఖ్యంగా మీ భోజన సమయం బాగుంటే మీరు మీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. కానీ చాలా మంది రాత్రి ఏ పదో, పదకొండింటికో తింటుంటారు. ఇది మంచి అలవాటు అస్సలు కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రి 7 గంటలకు ముందే డిన్నర్ ను చేస్తే మీరు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. రాత్రి 7 లోపు డిన్నర్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గ్యాస్ట్రిక్ సమస్య: రాత్రి 7 గంటలకు ముందే భోజనం చేయడం వల్ల గుండెల్లో మంట లేదా అజీర్ణం వంటి లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. ఇలా తింటే జీర్ణశయాంతర అసౌకర్యం చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యల వల్ల కలిగే సమస్యలు తగ్గి రాత్రిపూట బాగా నిద్ర వస్తుంది.
జీర్ణక్రియకు: ఆహారం జీర్ణం కావడానికి శక్తి అవసరం. ఈ శక్తిని ఫుడ్ అందిస్తుంది. మీరు రాత్రి ఏడుగంటల లోపు తింటే జీర్ణ అవయవాలకు రక్త ప్రవాహం కూడా అందుతుంది. మీరు రాత్రి 7 గంటల లోపు తింటే మీ శరీరం ఆహారాన్ని సమర్థవంతంగా జీర్ణం చేస్తుంది. అలాగే మీరు నిద్రపోవడానికి మిమ్మల్ని సిద్దం చేయడానికి అవసరమైన సమయం కూడా దొరుకుతుంది. ఇది మీ శరీరం జీర్ణ ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. ఇది మీ మొత్తం శ్రేయస్సు, శక్తిని మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యకరమైన ఆకలి: రాత్రి 7 గంటల లోపు డిన్నర్ చేసే అలవాటున్న వ్యక్తులను అతిగా ఆకలి కాదు. అలాగే ఉదయం లేచిన తర్వాత మంచి పోషకాహారం తినాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ పద్దతిని ఫాలో అయ్యే వ్యక్తులకు స్టామినా బాగుంటుంది.
అదనపు కేలరీల తగ్గింపు: రాత్రి 7 గంటల లోపు తిని రాత్రి 10 గంటల లోపు పడుకునే వ్యక్తులు బరువు పెరిగే అవకాశమే ఉండదు. అందులోనూ అధిక బరువు ఉన్నవారు ఈ పద్దతిని పాటిస్తే చాలా సులువుగా బరువు తగ్గుతారు. అనవసరంగా తినరు. అలాగే కేలరీలు తీసుకోవడం కూడా తగ్గుతుంది. ఇది మిమ్మల్ని బరువు తగ్గేలా చేస్తుంది.
మధుమేహులకు: డయాబెటీస్ పేషెంట్లు రాత్రి 7 గంటల లోపు తినడం అలవాటు చేసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ను నియంత్రించాలనుకునే, సాయంత్రం మందులపై ఆధారపడేవారికి రాత్రి 7 గంటలకు ముందు భోజనం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.