Asianet News TeluguAsianet News Telugu

ఇంటి ముందు కాకి అరిస్తే ఏమౌతుంది?

కాకులు ఇంటి ముందుకు వస్తుంటాయి. అప్పుడప్పుడు అరుస్తుంటాయి. కానీ కాకి అరుపులు మనకు ఎలాంటి సంకేతాలను ఇస్తాయో తెలుసా? 
 

what does it mean when crow shouts rsl
Author
First Published Aug 29, 2024, 9:47 AM IST | Last Updated Aug 29, 2024, 9:47 AM IST

భారతీయ సంస్కృతిలో జంతువులు, పక్షుల ప్రవర్తనకు, వాటి శబ్దాలకు చాలా మ్రాముఖ్యతనిస్తారు.ముఖ్యంగా వీటిలో కాకులకున్న స్థానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పక్షి మన చుట్టూ ఉన్న పర్యావరణంతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది. ఇవి పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే చాలా మంది కాకులను అశుభంగా భావిస్తారు. అవి తలపై తన్నితే ఏదో చెడు జరగబోతుందని అర్థం చేసుకుంటారు. అలాంటి కాకులు మన ఇంటిముందుకు వచ్చి అరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి. 

కాకుల అరుపు మంచి శకునమా లేక చెడు శకునమా? 

కాకుల అరుపులు  మంచివి కావంటారు. అందుకే దీన్ని చెడు శకునంగా భావిస్తారు. కాకులు మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మన జీవితంలో ఏదో చెడు ఘటన జరగబోతుందని సంకేతంగా భావిస్తారు. అవేంటంటే? 

ధనలాభం

 అవును కొన్ని సమయాల్లో కాకుల అరుపు ధనలాభాన్ని సూచిస్తుంది. సూర్యోదయ సమయంలో కాకుల అరుపులను శుభప్రదంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతోందనడాన్ని సూచిస్తుంది. ఇది త్వరలోనే మీకు సంపద కలుగుతుండటాన్ని సూచిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఇది మీ జీవితంలో ఆనందం,  శ్రేయస్సును కూడా పెంచుతుంది.

అతిధి రాక 

ఇంటి ఆవరణలో లేదా ఇంటి పై కప్పుపై కాకి అరిస్తే.. మీ ఇంటికి ఎవరో ఒక అతిథి రాబోతున్నారన్న సంకేతంగా పరిగణించబడుతుంది. భారతీయ సంప్రదాయంల.. అతిథుల రాకను శుభప్రదంగా భావిస్తారు, ఎందుకంటే అతిథులను లక్ష్మీ రూపంగా భావిస్తారు. అతిథి రాక మీ ఇంటికి సంతోషాన్ని, అదృష్టాన్ని తెస్తుంది.

చెడు శకునం 

కాకి అకస్మాత్తుగా గట్టి గట్టిగా అరిచిన.. ఈ అరుపులు ఎక్కువ సేపు ఉన్నా.. అది బాధకు లేదా సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది అశుభ ఘటనను సూచిస్తుంది.

మరణ సంకేతం

మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా సమీపంలో కాకి పదేపదే అరిస్తే అది సమీప బంధువు మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది. శకున శాస్త్రంలో దీన్ని ప్రమాదకరంగా భావిస్తారు. అలాగే దీన్ని ఎంతో అపాయకరమైన సంకేతంగా భావిస్తారు.

బాధలు, తగాదాలు

కాకులు పదేపదే అరవడం వల్ల ఇంట్లో వివాదాలు, కలహాలు, గొడవలకు సంకేతంగా భావిస్తారు. ఈ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు లేదా విభేదాలు పెరగొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఇంటి వాతావరణాన్ని అల్లకల్లోలం చేస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios