శృంగారంలో రెచ్చిపోవాలని చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అది వాడితే.. అంగస్తంభన త్వరగా జరగకుండా ఉంటుందని దీనిని వాడుతుంటారు. అయితే.. ఒక్కోసారి వీటి ప్రభావం ఎక్కువ సేపు ఉండటం వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది.

వయాగ్రాని అందరూ వాడకూడదని..కేవలం అంగస్తంభన సమస్యలు ఉన్నవారు మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. శృంగారంలో పాల్గొనేంత ఫిట్ గా లేని వాళ్లు కూడా దీనిని వాడకూడదు. దాని కారణంగా వాళ్లు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వయాగ్రా పిల్స్.. పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. దీనిని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి కూడా లేదట. శృంగారంలో పాల్గొనాలి అనుకున్న సమయానికి కంటే గంట ముందుగా వేసుకోవాలి. అప్పుడే దాని పనితీరు బాగుంటుందని చెబుతున్నారు.దీనిని ఆహారంలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. కానీ.. గ్రేప్ జ్యూస్ లో మాత్రం కలిపి తీసుకోకూడదట. అలా తీసుకుంటే దాని పనితీరు తగ్గిపోతుంది.

శృంగారం అయిపోయిన తర్వాత కూడా కొందరిలో వయాగ్రా ప్రభావం మాత్రం తగ్గడంలేదని నిపుణుల పరిశోధనలో తేలింది. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. రోజుకి ఒక్కసారి మాత్రమే ఈ మాత్ర తీసుకోవాలని.. అది కూడా 50ఎంజీకి మించరాదని సూచిస్తున్నారు.