Wearing Mask : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. మాస్క్ లను ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలైతే పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు మాస్క్ ధరించకుంటే ఫైన్ కూడా వేస్తున్నాయి. అయితే గంటల తరబడి మాస్కులను ధరించడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.
Wearing Mask : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మాస్క్ ను తప్పనిసరి చేస్తున్నాయి ప్రభుత్వాలు. కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి మాస్క్ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రపంచ దేశాలు సైతం మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నాయి.
కానీ మాస్క్ ను గంటల తరబడి ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఇది వరకే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఎక్కువ సేపు మాస్క్ ను ధరించడం వల్ల ముఖంపై మొటిమలు, చర్మం దురద పెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దంతాలు దెబ్బతినడం వంటి అనేక సమస్యలు వస్తాయి.
కొత్త అధ్యయనం ప్రకారం మాస్క్ ను ఎక్కువ సేపు ధరించడం వల్ల మరొక వ్యాధి బారిన పడతారని తెలియజేస్తుంది. ఈ అధ్యయనం వివరాలను ప్రముఖ scientific publication అయిన Scientific reports విడుదల చేశాయి.
ఈ అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా మాస్కులను ధరించే వ్యక్తులు కళ్లను ప్రభావితం చేసే డ్రై ఐస్ సిండ్రోమ్ (Dry ice syndrome) బారిన పడుుతున్ననారట. అయితే ఈ Dry ice syndrome వ్యాధి మాస్క్ ధరించడం వల్లే కాదు వివిధ కారణాల వల్ల కూడా వస్తుందట. అయితే దీని బారిన పడిన వారు ఎక్కువగా మాస్క్ ధరించిన వాల్లే ఉన్నారని పరిశోధకులు కనుగొన్నారు. దీనిని పరిశోధకులు Mask-related dry eye గా వర్ణించారు.
డ్రై ఐస్ సిండ్రోమ్ లక్షణాలు.. కంటిలో దురద, నొప్పి, మండుతున్నట్టుగా అనిపించడం, కండ్లు పొడిబారడం, కళ్లు ఎర్రబడటం, కాంతిని చూడటానికి ఇబ్బంది పడటం, కళ్లలోంచి నీల్లు కారడం, కళ్లు మసకబారడం, కళ్లు అసలిపోవడం, కనురెప్పలు వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డ్రై ఐ అంటే అసాధారణంగా కన్ను పొడిబారడం అని అర్థం. ఈ సమస్య దృష్టి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అందుకే ఈ సమస్యకు చికిత్సను త్వరగా తీసుకురావాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మాస్క్ ధరించడం వల్ల ఎవరికైనా డ్రై ఐస్ సిండ్రోమ్ రావొచ్చు. కానీ సాధారణంగా కళ్లజోడు ధరించి కాంటాక్ట్ లెన్స్ వాడే వారికి కూడా డ్రై ఐస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుుంది. అలాగే కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ , మొబైల్ ఫోన్ స్క్రీన్ ను ఎక్కువ సేపు చూసేవారిలో కూడా డ్రై ఐస్ సమస్య వచ్చే అవకాశం ఉందట.
ఏసీ ఎక్కువగా ఉపయోగించడం, వేడి వాతావరణంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల కూడా డ్రై ఐస్ సిండ్రోమ్ రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల కూడా డ్రై ఐస్ సిండ్రోమ్ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
