Asianet News TeluguAsianet News Telugu

స్మార్ట్ ఫోన్ తో ‘సామర్థ్య పరీక్ష’ అది కూడా ఇంట్లోనే..

ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీ వెంట పరిగెడుతోందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ చాలా రకాలుగా వాడి ఉంటారు. అయితే.. ఇప్పుడు వీర్య కణాల సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. ఈ మేరకు కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. 

Want to Test Your Sperm? There's an App for That
Author
Hyderabad, First Published Jul 29, 2019, 3:32 PM IST

పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా... సంతానం కలగనివారు వైద్యులను సంప్రదిస్తే.. ముందుగా పురుషులకు వీర్య కణాల సంఖ్య ఎలా ఉందో తెలుసుకునేందుకు పరీక్ష చేస్తారు. దాని ద్వారా వీర్య కణాల సంఖ్య ఎంత ఉంది? సంతానం కలిగే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని వైద్యులు తెలియజేస్తారు. అయితే... డాక్టర్లను సంప్రదించకుండానే కేవలం ఇంట్లోనే సామర్థ్య పరీక్ష చేసుకోవచ్చని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. అది కూడా మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ తోనే.

ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీ వెంట పరిగెడుతోందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ చాలా రకాలుగా వాడి ఉంటారు. అయితే.. ఇప్పుడు వీర్య కణాల సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. ఈ మేరకు కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. వీర్య కణాల నాణ్యత, ఆరోగ్యాన్ని కేవలం చేతిలో స్మార్ట్ ఫోన్ తో ఇట్టే తెలుసుకోవచ్చు.

చికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్శిటీ విద్యార్థి యోషితోమో కొబోరి స్మార్ట్ ఫోన్లను మైక్రో స్కోప్ లు గా మార్చే ప్రత్యేక లెన్స్ లను రూపొందించారు. ఈ లెన్స్ వీర్యాన్ని క్షుణ్నంగ పరిశీలించి.. వంధత్వ సమస్యలను గుర్తిస్తాయి. ఈ లెన్స్ ను ఉపయోగించి ఐఫోన్ మైక్రో స్కోప్ ను తయారు చేశారు.

ఈ లెన్స్ ను స్మార్ట్ఫోన్ కు అనుసంధానించే పద్ధతిని రూపొందించారు. ఇది కెమేరాకు అనుసంధానమే వీడియో రూపంలో స్పెర్మ్ కౌంట్ పరీక్షలు చేస్తుందని వారు చెబుతున్నారు. కేవలం నిమిషంలో దీనికి సంబంధించిన రిపోర్ట్ మనకు తెలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ అనలైజర్ తోపాటు దీన్ని స్మార్ట్ ఫోన్ కు అనుసంధానించేందుకు ఓ ఆప్టికల్ కేబుల్,వీర్యాన్ని ఉంచేందుకు డిస్పోజబుల్ పరికరాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులోని మైక్రోచిప్ వీర్యనమూనాని పరీక్షించి ఆప్టికల్ కేబుల్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు సమాచారం చేరవేస్తుందని నిపుణులు  చెబుతున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ యాప్ లో వచ్చే ఫలితాలు 98శాతం నిజమౌతాయని వారు చెబుతున్నారు. త్వరలోనే ఈ యాప్ వాడుకలోకి రానుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios