అబద్ధాలు చెబితే తెలివితేటలు పెరుగుతాయా..?
చిన్నపిల్లలు కొంతమంది చాలా చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. దానికి ఇంట్లో పెద్దలు కోపం తెచ్చేసుకొని వారిని దండిస్తూ ఉంటారు.
ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవసరానికి ప్రతి ఒక్కరూ అబద్ధం చెప్పే ఉంటారు. అసలు అబద్ధాలు చెప్పనివారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఈ అలవాటు దాదాపు అందరికీ చిన్నవయసులోనే అలవడి ఉంటుంది. మీరు గమనించి ఉంటే.. చిన్నపిల్లలు కొంతమంది చాలా చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. దానికి ఇంట్లో పెద్దలు కోపం తెచ్చేసుకొని వారిని దండిస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే.. కొందరు పిల్లలు అబద్ధాలు చెబితే.. అసలు అది అబద్ధమని కూడా తెలీదు. అంత బాగా మేనేజ్ చేస్తుంటారు. అలా ఎదుటివారిని ఇట్టే నమ్మించేలా అబద్ధాలు చెప్పగలిగితే వారిలో అంత నేర్పరితనం పెరుగుతుందట. ముఖ్యంగా చిన్న పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయని కెనడాలోని టొరంటో వర్సిటీ పరిశోధకులు తెలిపారు.
40 నెలల సగటు వయసున్న 42 మంది పిల్లలపై నాలుగు రోజులపాటు జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించామన్నారు. 42 మంది పిల్లలను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపును క్రమశిక్షణగా, రెండో గ్రూపు పిల్లలకు అబద్ధాలు చెప్పడం, దాగుడుమూతలు ఆడటం నేర్పించగా అబద్ధాలు నేర్చుకున్న పిల్లల్లో తెలివితేటలు పెరిగాయట.