Ugadi 2023: ఉగాది స్పెషల్ పచ్చడిని ఇష్టపడని వారుండరు. నిజానికి ఈ పచ్చడి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి దీనిలో ఉండే 6 రుచుల సమ్మేళనం ఎలాంటి భావాన్ని చెబుతుంతో తెలుసా?
Ugadi 2023: ఉగాది పచ్చడి రుచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ పచ్చడి తీయగా, పుల్లగా, చేదుగా అంటూ 6 రుచులను కలిగి ఉంటుంది. అయితే ఉగాది పచ్చడిలోని ప్రతి రుచి మన జీవితంలోని వివిధ భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తుంది.
ఉగాది అభిరుచులు ఏంటి?
సింబాలిక్ రుచుల గురించి తెలుసుకునే ముందు ఈ పండుగ అంటే ఏంటో ముందు తెలుసుకోవడం ముఖ్యం. ఈ పండుగను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో జరుపుకుంటారు. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఇది కొత్త సంవత్సరం. సాధారణంగా ఉగాది అనేది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఒక ప్రాంతీయ నూతన సంవత్సర వేడుక. ఇది సాధారణంగా ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ రాష్ట్రాల ప్రజలు ఉగాదికి ఉగాది పచ్చడిని చేసుకుని తాగుతారు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆ రుచులేంటి? వాటి ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కారం
కారం వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ పదార్ధం జీవితంలో కోపం లేదా ఉద్రేకాన్ని సూచిస్తుంది. అంటే ఈ భావోద్వేగాన్ని ప్రోత్సహించాలని కాదు. జీవితం ఒక వ్యక్తి ప్రతికూల పరిస్థితులను అనుభవించేలా చేస్తుందని అర్థం. అందుకే ఇలాంటి పరిస్థితుల గురించి మనం తెలుసుకోవాలి. ప్రతికూల భావోద్వేగాలను అధిగమించడానికి బదులుగా వాటి నుంచి బయటపడే మార్గాలకు సిద్దం కావాలి.
మిరపకాయ ఆరోగ్య ప్రయోజనాలు
క్యాప్సైసిన్ అనే పదార్థం వల్ల మిరప మంటతో పోరాడుతుంది.
ముక్కు దిబ్బడను తగ్గించడానికి సహాయపడుతుంది
మిరపకాయ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
చింతపండు
ఈ పదార్ధం జీవితంలోని అసమ్యకరమైన, ఇష్టంలేని అనుభవాన్ని కలిగి ఉంటుంది. జీవితం ఎప్పుడూ మనం కోరుకున్నట్టుగా ఉండదు. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో ఇష్టంలేని పరిస్థితులను ఎదుర్కొంటాడు. దీన్ని కూడా అన్నింటిలాగే స్వీకరించాలి.
చింతపండు ఆరోగ్య ప్రయోజనాలు
జీవక్రియను ఉత్తేజపరిచి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది.
ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది
చింతపండు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఉప్పు
ఉప్పగా ఉండే రుచికి భయాన్ని సూచిస్తుంది. మన మందరం సంపదను, వ్యక్తులను, వస్తువులను కోల్పోతామనే భయంతో ఉంటాము. ఆరోగ్యాన్ని కోల్పోతామనే భయం గురించే మనం ఆలోచించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమై, మంచి ఆహారాన్ని మాత్రమే తినాలి.
ఉప్పు ఆరోగ్య ప్రయోజనాలు
థైరాయిడ్ పనితీరులో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
తక్కువ రక్తపోటును నివారించడానికి దీనిని ఉపయోగించొచ్చు.
మామిడి
ఇది మన జీవితంలో ఊహించని మలుపులను సూచిస్తుంది. జీవితంలోని ప్రతి మలుపు ఆశ్చర్యంతో కూడుకున్నదే. జీవితంలో వచ్చిన ప్రతి భావోద్వేగాన్ని స్వీకరించి ఆస్వాదించాల్సిన అవసరం ఉందని ఇది తెలియజేస్తుంది.
మామిడి ఆరోగ్య ప్రయోజనాలు
మామిడి కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది
ఇది చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది
మితంగా తినేటప్పుడు బరువు తగ్గడానికి సహాయపడుతుంది
వేప
ఇది జీవితంలోని చేదును సూచిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ జీవితం అందాకారంలోకి వెళ్లినప్పుడు వెలుగుకోసం ప్రయత్నించండి.
వేప ఆరోగ్య ప్రయోజనాలు
వేప పేస్ట్ ను గాయం మీద రుద్దితే గాయం త్వరగా నయమవుతుంది.
వేప చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది
ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది
బెల్లం
ఇది జీవితంలో ఆనందాన్ని సూచిస్తుంది. తీపిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే జీవితం మిశ్రమ భావోద్వేగాలు అని కూడా మనం అర్థం చేసుకోవాలి.
బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు
ఇది మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది
బెల్లం కాలేయాన్ని డీటాక్సిఫై చేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
