ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..!

ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా, జ్యూరిచ్ ఈ ఏడాది ఐదు స్థానాలు ఎగబాకి న్యూయార్క్ నగరం, జెనీవాను వెనుకకు నెట్టింది.

Top 10 Most Expensive Cities Of The World ram

ప్రపంచంలో  చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లోనూ  చాలా నగరాలు కూడా ఉన్నాయి. కాగా, ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన నగరాలు ఏంటో తెలుసా? ఆ నగరాల్లో జీవించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నవే. సాధారణంగా కంటే, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ.  ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) వారి వార్షిక వరల్డ్‌వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ఫలితాలను పంచుకుంది, ఇది సాధారణంగా ఉపయోగించే 200 కంటే ఎక్కువ వస్తువులు, సేవలకు స్థానిక కరెన్సీ పరంగా సగటున సంవత్సరానికి 7.4% ధరలు పెరిగాయని వెల్లడించింది.గత సంవత్సరం 8.1% మార్కుతో పోల్చి చూస్తే, తగ్గుదల ఉంది, అయినప్పటికీ, ధర పెరుగుదలలో గణనీయమైన పెరుగుదల ఉంది. మరి, ప్రపంచంలో కెల్లా ఖరీదైన నగరాలేంటో ఓసారి చూద్దాం...


ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలు

ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా, జ్యూరిచ్ ఈ ఏడాది ఐదు స్థానాలు ఎగబాకి న్యూయార్క్ నగరం, జెనీవాను వెనుకకు నెట్టింది.


రెండు ఆసియా నగరాలు (సింగపూర్ , హాంకాంగ్), నాలుగు యూరోపియన్ నగరాలు (జూరిచ్, జెనీవా, పారిస్ , కోపెన్‌హాగన్), మూడు US నగరాలు (న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో)  ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ టాప్ 10లో ఉన్నాయి.

ఏదేమైనప్పటికీ, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముందు సర్వే నిర్వహించారు కాబట్టి, ఈ  జాబితాలో టెల్ అవీవ్  పదవ స్థానం లో ఉంది. ఈ యుద్ధం తర్వాత ఆ స్థానంలో ఈ టెల్ అవీన్ నగరం ఉండే అవకాశం లేదు. 

ఇక, కరోనా మహమ్మారి కారణంగా, దేశం  నెమ్మదిగా పోస్ట్-పాండమిక్ రికవరీ , అణచివేయబడిన వినియోగదారుల డిమాండ్ ఫలితంగా చైనాలోని నగరాలు ఈ జాబితాలో వెనకపడిపోయాయి. లేదంటే, అవి కూడా ఈ జాబితాలో ఉండేవి. ఇక,  ఆగస్టు 14  నుండి  సెప్టెంబర్ 11, 2023 మధ్య నిర్వహించిన ఈ సర్వే ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో 400 కంటే ఎక్కువ వ్యక్తిగత ధరలను పోల్చింది. ఆ ధరలను పోల్చి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న నగరాలను ఎంపిక చేయడం విశేషం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios