ఇవి తింటే.. పురుషులు ‘వీర్యులు’ అవుతారు
మగవారిలో కనిపించే ఇన్ ఫెర్టిలిటీ సమస్యల్లో దాదాపు 90 శాతం వరకు స్పెర్మ్ కౌంట్ (వీర్య కణాలు) లోపం వల్ల వచ్చేవే. స్పెర్మ్ కౌంట్ తగినంతగా లేకపోతే వారు తండ్రి కావడం కష్టమే.
సంతాన సమస్యలతో బాధపడుతున్న జంటలు ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. మగవారిలో కనిపించే ఇన్ ఫెర్టిలిటీ సమస్యల్లో దాదాపు 90 శాతం వరకు స్పెర్మ్ కౌంట్ (వీర్య కణాలు) లోపం వల్ల వచ్చేవే. స్పెర్మ్ కౌంట్ తగినంతగా లేకపోతే వారు తండ్రి కావడం కష్టమే. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఆధునిక జీవన విధానమే కారణం. కొన్ని సాధారణ అలవాట్ల కారణంగా కూడా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతోంది.
మరి ఈ సమస్యకి పరిష్కారమే లేదా అంటే ఉంది అంటున్నారు నిపుణులు. ఈ సమస్యను ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. ఆహారంలో మైక్రోన్యూట్రియెంట్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. విటమిన్-సి, ఇ, ఫోలేట్ యాసిడ్ మరియు జింక్ మొదలైనవి తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే వీటితోపాటు కింద సూచించిన పదార్థాలు కూడా స్పెర్మ్ కౌంట్‌ను భారీగా పెంచడంలో తోడ్పడతాయి.
1) వెల్లుల్లి: వెల్లుల్లి ఉండే ‘ఎలిసిన్’ అనే పదార్థం స్పెర్మ్ క్వాలిటీని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ పదార్థం జననాంగాలకు రక్తం సరఫరా కావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే సెలూనియమ్, బీ6 స్పెర్మ్ డ్యామేజ్‌ను అరికడతాయి.
2) గుడ్లు: ఎగ్స్‌లో విటిమన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది వృషాణాల్లో కణాల నాశనాన్ని అరికడుతుంది. అలాగే గుడ్లలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతాయి.
3) అరటి: అరటి పళ్లలో బ్రొమేలియన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సెక్స్ హార్మోన్ల విడుదలను క్రమబద్దీకరిస్తుంది. అలాగే దీనిలో ఉండే ఎ, బీ1, సి విటమిన్‌లు వీర్యం ఉత్పత్తిని పెంచుతాయి.
4) డార్క్ చాకొలెట్స్: వీటిల్లో ఉండే ఎల్-అర్గినిన్ హెచ్‌సీఎల్ అనే ఉత్ర్పేరకం కూడా వీర్యం ఉత్పత్తిని పెంచుతుంది.
read more news
పురుషాంగం పరిమాణం చిన్నగా ఉందా..? ఆ సమస్య తప్పదు
షాకింగ్ న్యూస్.. సెక్స్ టాయ్స్ తోనే ఎక్కువ తృప్తి