ఊహల్లో ఒకరితో.. బెడ్ పై మరొకరితో..
భార్యని కాకుండా మరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడం మాత్రమే కాదు..వారితో పర్సనల్ మెసేజ్ లు చేయడం కూడా అంటున్నారు నిపుణులు.
పెళ్లికి ముందు ప్రేమ.. అనివార్య కరణాలతో బ్రేకప్.. ఆ తర్వాత మరొకరితో పెళ్లి ఇది చాలా మంది జీవితంలో జరుగుతూనే ఉంటుంది. వారంతా.. పెళ్లి ద్వారా తమ జీవితంలోకి వచ్చిన వారితో హ్యాపీగా ఉంటున్నారా.. అడ్జస్ట్ అవుతున్నారా..? లేదా.. ప్రేమగా నటిస్తూ...మరొకరిని ఊహించుకుంటూ కాపురం చేస్తున్నారా..? ఇదే అంశంపై ఓ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
నూటికి 60శాతం మంది తమ లైఫ్ పార్టనర్స్ ని మోసం చేస్తున్నట్లు తెలిసింది. మోసం అంటే.. భార్యని కాకుండా మరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడం మాత్రమే కాదు..వారితో పర్సనల్ మెసేజ్ లు చేయడం కూడా అంటున్నారు నిపుణులు.
ప్రస్తుత కాలంలో పెళ్లయిన వాళ్లు, ప్రేమలో ఉన్నవారు చాలా మంది పురుషులు, మహిళలు.. ఆన్ లైన్ యాప్ ల ద్వారా తమ భాగస్వాములను మోసం చేస్తున్నారట. సోషల్ మీడియాలో వేరే వారిని ఫాలో అవ్వడం, వాళ్ల ఫోటోలకు లైకులు కొట్టడం, కామెంట్స్ పెట్టడం కూడా మోసం కిందకే వస్తాయట.
జీవిత భాగస్వామితో సెక్స్ చేసేటప్పుడు ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోవడం, పెళ్లి అయ్యాక కూడా డేటింగ్ యాప్స్ వాడటం లాంటివి ముమ్మాటికీ మోసమేనంటున్నారు. పాత లవర్స్ కి మెసేజ్ చేయడం.. వారి నుంచి మునుపటి ప్రేమను పొందాలనుకోవడం చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
పెళ్లి తర్వాత కూడా డేటింగ్ యాప్స్ లో ప్రొఫైల్ ని కంటిన్యూ చేయడం మాత్రం చాలా క్రూరమైన చర్యగా నిపుణులు భావిస్తున్నారు.