Asianet News TeluguAsianet News Telugu

వారం రోజుల్లో బరువు తగ్గించే హెల్దీ డైట్ ఇది..

 కేవలం ఏడురోజుల్లో బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. అది కూడా పుష్కలంగా కడుపు నిండా తింటూనే.. వారినిక 5 నుంచి 7కిలోల బరువు తగ్గొచ్చట. 

The GM Diet Plan: How To Lose Weight In Just 7 Days
Author
Hyderabad, First Published Oct 15, 2018, 3:51 PM IST

బరువు తగ్గి.. సన్నగా, నాజుకుగా కనిపించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దాని కోసం పొట్టమాడ్చుకొని, జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ ఉంటారు. అయితే.. కేవలం ఏడురోజుల్లో బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. అది కూడా పుష్కలంగా కడుపు నిండా తింటూనే.. వారినిక 5 నుంచి 7కిలోల బరువు తగ్గొచ్చట. 1985లో ‘జనరల్ మోటార్స్’ సంస్థ అనేక పరిశోధనలు జరిపి.. ఈ ‘డైట్’ కనుగొంది. అందుకే దీన్ని ‘జీ ఎం’ డైట్ అని పిలుస్తున్నారు. మరి ఈ డైట్ ని ఎలా ఫాలో అవ్వాలో ఓసారి చూసేద్దామా..

వారంలో ఒక్కో రోజు ఒక్కో రకమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీన్నే ఫుడ్‌గ్రూప్ విధానం అని కూడా అంటారు. శరీరంలోని కొవ్వులను వేగంగా మండించి, బరువు తగ్గించేందుకు ఈ డైట్ ఉపయోగపడుతుంది. జీఎం డైట్‌లో తీసుకునే ఆహారంలో కెలోరీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి కావల్సిన కేలోరీ లభించవు. దీంతో శరీరంలో ఉండే కేలోరీల ఖర్చవుతాయి. దీనివల్ల క్రమేనా బరువు తగ్గుతారు. 

సోమవారం (Day 1) : పండ్లు మాత్రమే తినాలి. అరటి పండ్లు తినకూడదు. ముఖ్యంగా పుచ్చకాయలు తినడం చాలా మంచిది. 
మంగళవారం (Day 2): ఈ రోజు ఆకు కూరలు, కాయగూరలు మాత్రమే తినాలి. పచ్చిగా లేదా ఉడికించి వీటిని తినొచ్చు. బంగాళా దుంపలు తినకూడదు.బుధవారం (Day 3): పండ్లతో పాటు కూరగాయలు లేదా ఆకు కూరలు తినాలి. 
గురువారం (Day 4): కేవలం అరటి పండ్లు పాలు తీసుకోవాలి. రోజులో ఆరు నుంచి ఎనిమిది అరటి పండ్లు, మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి. 
శుక్రవారం (Day 5): రెండు పూటల చికెన్ లేదా చేపలు తినాలి. శాఖాహారులైతే మాంసానికి బదులు పొట్టుతో ఉన్న ముడి బియ్యం అన్నంలా వండుకుని తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. 
శనివారం (Day 6): రోజులో రెండు పూటల చికెన్ లేదా చేపలు తినాలి. వీటితో పాటు కాయగూరలు లేదా ఆకుకూరలు తినాలి. బంగాళా దుంపలు మాత్రం తినరాదు. శాఖహారులైతే శుక్రవారం తరహాలోనే పొట్టుతో ఉన్న ముడి బియ్యం తినాలి. నీరు ఎక్కువగా తాగాలి. 
ఆదివారం (Day 7): పొట్టు తీయని ముడి బియ్యం అన్నంగా వండుకుని తినాలి. పండ్లు, పండ్ల రసాలు, ఆకు కూరలు, కాయగూరలు కూడా తినొచ్చు. చక్కెర కలపని గ్రీన్ టీ తాగొచ్చు. అయితే సోడాలు, కూల్ డ్రింక్‌లు తాగరాదు. 

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ డైట్ ఫాలో అయ్యేవారు మద్యం సేవించరాదు. రోజు కి కనీసం 12గ్లాసుల మంచినీటిని తీసుకోవాలి. కూరగాయలతో చేసిన సూప్ లను తీసుకోవాలి. హోమ్ మేడ్ ఫుడ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఒక వారం ఈ డైట్ ని ఫాలో అయితే.. మరో వారం గ్యాప్ ఇచ్చి మళ్లీ డైట్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా యోగా చేయడం ఉత్తమం. 

Follow Us:
Download App:
  • android
  • ios