Asianet News TeluguAsianet News Telugu

అవాంఛిత గర్భానికి చెక్.. స్త్రీలకు ఇదో చక్కని మార్గం

18నుంచి 45ళఏ్ల వివాహిత మహిళలు ఈ ఇంజెక్షన్లను వినియోగించుకొని అవాంఛిత గర్భదారణను నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దాదాపు తొలి ప్రసవం తర్వాత వెంటనే గర్భం దాల్చకుండా ఉండేందుకు ఈ ఇంజెక్షన్లను మహిళలు వినియోగిస్తున్నారు.

The contraceptive injection for birth control
Author
Hyderabad, First Published Aug 26, 2019, 4:51 PM IST

కొత్తగా పెళ్లైన దంపతులు వెంటనే సంతానం కావాలని కోరుకోరు. అలాంటి వాళ్లు.. గర్భనిరోదక మాత్రలు వాడటం లాంటివి చేస్తుంటారు. వాటి కారణంగా.. అప్పుడు గర్భం రాకుండా ఆపగలుగుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ..  భవిష్యత్తులో అసలు గర్భం రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. అలా అని కండోమ్ వాడటం చాలా మందికి నచ్చదు. అయితే... దీనికి వైద్యులు చక్కటి పరిష్కారం కనుగొన్నారు.

ఇంజెక్టబుల్ కాంట్రెస్టివ్ ని వైద్యులు మన ముందుకు తీసుకువచ్చారు. శాస్త్రియంగా దీనిని డీఆక్సీ మెడ్రాక్సి ప్రొజెస్టిరాన్ ఎసిటేట్ గా పిలుస్తారు. దీనిని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. దీనిని కనుక మహిళలకు ఇస్తే... మూడు నెలల వరకు గర్భం రాదు.  దాదాపు మూడు నెలలపాటు అండాల విడుదల నిలిచిపోతుంది. ఫలితంగా మహిళ గర్భం దాల్చే అవకాశం ఉండదు.

18నుంచి 45ళఏ్ల వివాహిత మహిళలు ఈ ఇంజెక్షన్లను వినియోగించుకొని అవాంఛిత గర్భదారణను నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దాదాపు తొలి ప్రసవం తర్వాత వెంటనే గర్భం దాల్చకుండా ఉండేందుకు ఈ ఇంజెక్షన్లను మహిళలు వినియోగిస్తున్నారు.  ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో.. గర్భ నిరోదక సాధనాలు అందుబాటులో లేకపోవడం వల్లే 12.9 శాతం అవాంఛిత గర్భాలకు కారణమౌతున్నాయని  తేలింది. దీనిని దృష్టిలో ఉంచుకొని పీహెచ్సీ స్థాయి వరకు గర్భ నిరోదక ఇంజెక్షన్ లను అందుబాటులో ఉంచాలని నిపుణులు నిర్ణయించారు.

ఇప్పటికే జనాభా నియంత్రణకు కండోమ్ లు, కాపర్ టీ, గర్భ నిరోధక మాత్రలు, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ వంటి పద్ధతులు అమలులో ఉన్నాయి. కొత్తగా గర్భ నిరోధక ఇంజెక్షన్లను ప్రవేశపెట్టారు. బిడ్డకు, బిడ్డకు ఎడం ఉంచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దీని వల్ల 30శాతం మాతృ మరణాలు, 10శాతం శిశు మరణాలు కూడా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios