Asianet News TeluguAsianet News Telugu

Covid Guidelines: వీరికి మాస్క్ అవసరం లేదంటున్న కేంద్రం..

Covid Guidelines: దేశంలో ఒకవైపు కరోనా కేసులు, మరో వైపు ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్రం కూడా ప్రజల సంక్షేమం గూర్చి తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాయి. అయితే కోవిడ్ మాస్కులను తప్పని సరిగా ధరించాలని చెప్పిన కేంద్రం తాజాగా ఈ ఏజ్ వాళ్లు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

The central government says children under the age of five do not need a mask
Author
Hyderabad, First Published Jan 21, 2022, 9:55 AM IST


Covid Guidelines: దేశంలో ఒకవైపు కరోనా కేసులు, మరో వైపు ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్రం కూడా ప్రజల సంక్షేమం గూర్చి తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాయి. అయితే కోవిడ్ మాస్కులను తప్పని సరిగా ధరించాలని చెప్పిన కేంద్రం తాజాగా ఈ ఏజ్ వాళ్లు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి భారిగా వ్యాపిస్తోంది. ఎంతో మంది దీని బారినపడుతున్నారు. రోజుకు లక్షల్లో కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. అందులోనూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా దారుణంగా పెరుగుతున్నాయి. దీని వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉందంటూ నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. దాంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్రం కూడా ప్రజలు మరింత ప్రమత్తంగా ఉండాలంటూ ఎన్నో సూచనలను చేస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలను సైతం చేపడుతోంది. 

అయినా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకే అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలనీ, శానిటైజేషన్ తప్పనిసరి, మాస్కులు మస్ట్ అని ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేశాయి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు కూడా మాస్కులు తప్పని సరిగా ధరించాలని ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం కొవిడ్ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 18 ఏండ్ల కంటే తక్కువ సంవత్సరాలున్న వారికి కరోనా Infection ప్రభావం గురించి గురువారం నాడు కోవిడ్ కొత్త గైడ్ లైన్స్ ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 

18 ఏండ్ల లోపున్న వారు అలాగే చిన్న పిల్లలకు ఈ వైరస్ Treatment విధానాన్ని సవరించింది. దీనిలో ఐదేండ్ల లోపున్న చిన్న పిల్లలకు మాస్క్ లు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే 6 నుంచి 11 ఏండ్ల పిల్లలకు మాస్క్ తప్పనిసరిగా అవసరమేనని తెలిపింది. ఈ ఏజ్ పిల్లలను తమ తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుని సరైన పద్దతిలో మాస్కులను పెట్టవచ్చని కేంద్రం వెళ్లడించింది. ఇకపోతే 12 ఏండ్లకంటే ఎక్కువ వయసున్న వాళ్లు మాస్క్ లను తప్పనిసరిగా పెద్దవారిలాగే పెట్టుకోవాలని సూచించింది. కాగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గ దర్శకాలను జారీ చేసింది. 

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. దీని తీవ్రత  తక్కవగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి చాలా తొందరగా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదని కేంద్రం హెచ్చరిస్తోంది.  అయితే  ఒమిక్రాన్ వ్యాపించిన వారి వ్యాధి తీవ్రతను బట్టే చికిత్సా విధానం ఉంటుందని వెళ్లడించింది. వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నవారికి ‘యాంటీమైక్రోబయాల్స్ లేదా ప్రొఫిలాక్సిస్’ అవసరం లేదని వెళ్లడించింది. అంటే ఇది సోకిన వారి లక్షణాలు, తీవ్రత అధికంగా ఉంటేనే ఈ చికిత్స అవసరమని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios