Thati kallu: తాటికల్లును అప్పుడు తాగితేనే మంచిది.. దీని ప్రయోజనాలు అద్బుతం..
Thati kallu: పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే తాటికల్లు ఎక్కువగా లభిస్తుంది. ఇక ఈ తాటికల్లు ప్రియులు దీన్ని ప్రతి రోజూ తాగకుండా ఉండలేరు. అందుకే గ్రామాల్లో తాటికల్లు చాలా ఫేమస్. అయితే తాటికల్లులో ఎన్నో ఔషదగుణాలున్నా.. దాన్ని ఆ సమయంలోనే తాగితే ఆరోగ్యానికి మంచిది.
Thati kallu: తాటికల్లులో విటమిన్లు, లవణాలు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని గ్రామప్రజలు దివ్య ఔషదంలా భావించి తాగుతూ ఉంటారు. అందుకే కదా ఈ చెట్టును కల్పవృక్షంగా భావించేవారు మన పూర్వీకులు. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా.. దాన్ని ఈ కల్లు ద్వారానే పరిష్కరించుకునే మార్గాన్ని వెతికేవారు.
ఈ తాటికళ్లు ద్వారా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి పలు అధ్యయనాల్లో కూడా వెళ్లడైంది. అయితే ఇక్కడే ఒక విషయం గుర్తించుకోవాలి. ఏదైనా సరే పరిమితికి మించితే అది ప్రమాదకరంగా మారుతుంది. ఇది తాటికల్లును తాగే విషయంలో కూడా వర్తిస్తుంది. మరి ఈ తాటికల్లును ఏ సమయంలో తాగాలి? ఎప్పుడు తాగాలి? ఎలా తాగితే మన ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
తాటికల్లును చెట్టునుంచి తీసిన వెంటనే తాగాలి. ఇలా తీసిన కల్లులో ఓ రకమైన సూక్ష్మజీవి ఉంటుంది. అందుకే చెట్టునుంచి తీసినవెంటనే ఆ సూక్ష్మజీవి మన శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ కారకాలు ఉంటే వాటిని చంపేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
ఈ తాటికల్లును చెట్టునుంచి తీసిన వెంటనే తాగితే ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి. అదే కొన్ని గంటల పాటు కల్లును అలాగే ఉంచితే అది బాగా పులిసి ఆల్కహాల్ లాగా తయారవుతుంది. అలా మారిన కల్లును తాగితే మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి చెట్టునుంచి తీసిన వెంటనే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఈ తాటికల్లును తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా టైఫాయిడ్, డయేరియా వంటి రోగాలు సోకడానికి కారణమయ్యే వైరస్ లకు ఇది Antibiotic పనిచేసి వాటితో పోరాడుతుంది.
ప్రస్తుతం పట్టణాల్లో, నగరాల్లో జంక్ ఫుడ్, మసాలాల ఫుడ్ వాడకం బాగా పెరిగింది. ఇక్కడ నివసించే ప్రజలు తరచుగా ఆరోగ్యానికి హాని చేసే ఈ ఆహారాలను తింటూ అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ తాటికల్లు మంచి మేలు చేస్తుందనే చెప్పాలి. కడుపును క్లీన్ చేసే గుణాలు కల్లులో ఉంటాయి.
అందుకే ఎంతో మంది జీవితంలో ఒక్కసారైనా దీన్ని తాగాలని భావిస్తుంటారు. తాటికల్లే కాదు తాటి చెట్టు ఆకులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఈ తాటాకులతో గ్రామాల్లో గుడిసెలు వేస్తుంటారు. అలాగే బుట్టలు, విసనకర్రలు, టోపీలు, చాపలు, సంచులు, గొడుగులు వంటి తయారు చేస్తుంటారు. అంతేకాదు తాటిచెట్టు కలపతో ఇండ్లను కూడా కడుతుంటారు. ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి. అందుకే వీటిని స్తంబాలుగా, దూలాలుగా ఉపయోగిస్తుంటారు.