Asianet News TeluguAsianet News Telugu

ఆర్చరీ ప్రముఖ తెలుగు డాక్టర్ కి బంగారు పతాకం !

వైద్య వృత్తిలో ఉండి కూడా..  విలు విద్యలో జాన్ వాట్స్ ఇలా నేషనల్ మాస్టర్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం  గొప్ప విషయం.

telugu doctor john wats won gold medal in archery
Author
Hyderabad, First Published May 21, 2022, 6:10 PM IST


ఆర్చరీ నేషనల్ గేమ్స్ లో ప్రముఖ తెలుగు డాక్టర్ బంగారు పతకం సాధించారు. కేరళలోని  తిరువంతపురంలో జరిగిన నేషనల్ మాస్టర్ గేమ్స్ లో డాక్టర్ : జాన్ వాట్స్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ లోనే  టాప్ హెయిర్ ట్రాన్స్‌ ప్లాంట్ సర్జన్‌ గా  డాక్టర్ : జాన్ వాట్స్ ఎన్నో  అవార్డులను & రివార్డులను పొందారు. ఇప్పుడు ఆర్చరీలో కూడా అద్భుతమైన  ప్రతిభను కనబర్చడం విశేషం. ఆర్చరీలో సాధించిన ఈ బంగారు పతాకంతో జాన్ వాట్స్ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. 

 ధనుర్విద్య ( Archery), అతిప్రాచీన క్రీడ. పురాణ యుగపు కథానాయకుల నుండీ, ప్రతి నాయకులూ, రాజాధి రాజులు మొదలు, సామాన్య పౌరులూ, అందరూ విలువిద్యను నేర్చిన వారే, అందరికీ నేర్పిన వారే. ద్రుపదుని కొలువులో మత్స్య యంత్రాన్ని కొట్టిన అర్జునుడు, శివధనుస్సును విరిచి సీతను పెళ్ళాడిన రాముడూ  విశ్వామిత్రుని వద్ద విలువిద్యను నేర్చిన వారే.  విలువిద్య లోనే గురువును మించిన శిష్యుడనిపించు కున్నాడు ఏకలవ్యుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తన విల్లుతో, విల్లంబుల సైన్యంతో, గడగడ లాడించి తుపాకులకు ఎదురు నిల్చి, విల్లుతో ఎందరినో హత మార్చాడు. అంత గొప్ప చరిత్ర ఉంది విలువిద్యకి.


 వైద్య వృత్తిలో ఉండి కూడా..  విలు విద్యలో జాన్ వాట్స్  ఇలా నేషనల్ మాస్టర్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం  గొప్ప విషయం.  'డాక్టర్ : జాన్ వాట్స్' 1900 వందలకు పైగా  హెయిర్ అండ్ బియర్డ్ (గడ్డం)  ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలను వందశాతం సక్సెస్ ఫుల్ గా  పూర్తి చేసిన  సీనియర్ హెయిర్  ట్రాన్స్ ప్లాంట్  సర్జిన్. హైదరాబాద్ లోనే  టాప్ హెయిర్ ట్రాన్స్‌ ప్లాంట్ సర్జన్‌ లలో ఒకరిగా ఉన్నారు. డాక్టర్ గా అనేక మంది పేషెన్స్ కి వైద్యం అందించిన జాన్ వాట్స్, ఇప్పుడు ఆర్చరీ క్రీడాకారుడిగా ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్చరీ క్రీడా రంగంలో ఆయన మరో ఎన్నో పురస్కారాలు అందుకోవాలని కోరుకుందాం.

Follow Us:
Download App:
  • android
  • ios