Stars On Packets : ఇకనుంచి మనం తినే ఫుడ్ ప్యాకెట్స్ మన ఆరోగ్యానికి మంచి చేసేవా.. లేకపోతే చెడు చేసేవో కనుక్కోవడం చాలా సులభం. ఎందుకంటే మనం కొనే ప్రతి ఫుడ్ ప్యాకెట్స్ పైన స్టార్స్ ఉంటాయి. ఎన్ని ఎక్కువ స్టార్స్ ఉంటే అది మన ఆరోగ్యానికి అంత మంచిదని ఆహార భద్రత, ప్రమాణాల మండలి అధికారులు చెబుతున్నారు.
Stars On Packets : ఈ గజిబిజీ లైఫ్ లో ఏ ఆహారం మంచిదో.. ఏది చెడో ఎవరికీ ఆలోచించే సమయం అయితే లేదు. ఆకలేస్తే చాలు ఏదైనా కొనడం.. దాన్ని తినడమే తెలుసు. అది ఆరోగ్యానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనే విషయం మనకు అవసరం లేదు. ఒక వేళ తెలుసుకోవాలనుకున్నా.. దాన్ని తిన్న తర్వాతే తెలుస్తుంది. ఇకపై అలా ఉండదు. ఒక ప్రొడక్స్ మంచిదో, కాదో తెలుసుకోవడానికి దాన్ని తినే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇకపై ఫుడ్ ఫ్యాకెట్స్ పై స్టార్స్ ఉంటాయి. ఆ ప్యాకెట్స్ పై ఉన్న స్టార్స్ యే ఆ ఫుడ్ గురించి మొత్తం సమాచారాన్ని తెలియజేస్తాయన్న మాట.
అంటే ఆ ఫుడ్ ప్యాకెట్స్ పై ఎన్ని ఎక్కువ స్టార్స్ ఉంటే అవి మన ఆరోగ్యానికి అంత మంచివని అర్థం అని అధికారులు పేర్కొంటున్నారు. కాలంలో పాటుగా ఎన్నో కొత్త కొత్త ఆహార పదార్థాలు మనముందుకొస్తున్నాయి. ప్రతి ఒక్క ఆహార పదార్థం మన నోరు ఊరించేదిగానే ఉంటుంది. నోటిలో ఊరిళ్లు వచ్చే విధంగా రంగురంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ గజిబిజీ లైఫ్ లో వండుకుని తినే సమయం ఎవరికుంది. అందుకే ఆకలి వేయగానే ఫుడ్ ప్యాకెట్స్ వైపే మన మనస్సు మళ్లుతుంది. ఈ ఫుడ్ ప్యాకెట్స్ ను ఒక రకంగా చెప్పాలంటే రెడీ టూ ఈట్ లాగే మారిపోయింది. ఈ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని ప్రాసెస్ చేసినవే.
ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు గాను ఆ ఫుడ్స్ లో Preservatives కలుపుతారు. అంతేకాదు ఈ ప్యాకెట్ ఆహారాల్లో ఎన్నో రకాల Chemicals ను కలుపుతారు. వీటిని తిన్నప్పుడు మనపై వెంటనే చెడు ప్రభావం చూపకపోయినప్పటికీ .. తరచుగా తింటే మాత్రం మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. మనం అనారోగ్యం బారిన పడతాము.
ఈ విషయాలు సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. అవగాహన కూడా ఉండదు. ఇకపై అలా ఉండదు. మనం తీసుకునే ఫుడ్ ప్యాకెట్స్ పై హెల్త్ స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్ ను బట్టి మనం కొన్న ఫుడ్ ప్యాకెట్స్ మన ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేకపోతే హానీ చేస్తుందా అనేది తెసుకోవచ్చు.
వినియోగదారులు కొన్న ఆహారాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? హాని చేస్తాయా? అన్న విషయాన్ని ఈజీగా గుర్తుపట్టేందుకే స్టార్స్ సిస్టమ్ రానుంది. అంటే మన ఇంట్లో ఇప్పుడున్న ఏసీ లేదా రిఫ్రిజిరేటర్ పై ఎలా అయితే స్టార్స్ ఉంటాయో అలా అన్న మాట. వీటిపై 5 స్టార్స్ ఉంటే విద్యుత్ ను ఎక్కువగా ఆదా చేస్తదని అర్థం. ఇది అందరికీ తెలిసిందే. అదే స్టార్స్ తగ్గుతూ ఉంటే విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుందని మనం అర్థం చేసుకుంటాం. Council of Indian Standards ఈ స్టార్ రేటింగ్ సిస్టమ్ ను అమలు చేసింది.
Council of Indian Standards యే ఇకపై మనం కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ పై స్టార్ రేటింగ్ ను అమల్లోకి తీసుకురానుంది. మనం కొన్న ఆహార పదార్థాలు ఈ స్టార్ రేటింగ్ ను బట్టే అర్థం చేసుకోవచ్చన్నమాట. మనం కొన్న వాటిలో చక్కెర, కొవ్వు పదార్థాలు, ఉప్పు క్వాంటిటీ ఎంతుందో ఈ స్టార్స్ యే చెబుతాయి.
Indian Institute of Management, Ahmedabad.. వినియోగదారులు కొనే ఫుడ్ లో ఉండే పోషకాలు గురించి స్పష్టంగా తెలుసుకునేందుకు ఎలాంటి ప్రక్రియ చేపట్టాలో అధ్యయనం నిర్వహించింది. ఇందులోలో స్టార్ రేటింగ్, న్యూట్రిషన్ స్కోరు వంటివి హెచ్చరికలను గుర్తించారు. వీటి ద్వారా వినియోగదారులు ఏ ఫుడ్ మంచిది ఏది కాదు అన్న విషయాలను స్పష్టంగా తెలుసుకుంటారని FSSAI CEO అరుణ్ సింఘాల్ అన్నారు.
