srirama navami 2023: చైత్ర నవరాత్రుల చివరి రోజైన శ్రీరామ నవమి చైత్ర మాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మిస్తాడు. అందుకే ఆ రోజున శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.
srirama navami 2023: పుష్య నక్షత్రంలో చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజును శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు. ఈ వేడుకలకు రాముని భక్తులు ముందుగానే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తుంటారు. రామనవమి హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంకొన్ని పనులను అసలే చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పవిత్రమైన రోజున చేయవలసిన కొన్ని పనులు
- చాలా మంది రాముడి విగ్రహాన్ని ఊయలో ఉంచి రామ నవమి సంబరాలు జరుపుకుంటారు.
- ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.
- నిద్రలేచిన వెంటనే భగవంతుడికి దండం పెట్టుకోవడం మంచిది.
- అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల గత, వర్తమాన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
- రామచరిత మానస్, రామ్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కలిపి పఠించడం మంచిది.
- ఈ రోజున రామ కీర్తనలు, భజనలు, స్తోత్రాలు కూడా పఠిస్తారు.
- భక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం
- హనుమాన్ చాలీసా పఠించడం, నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయడం మంచిది.
- శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు. కాబట్టి ఆ సమయంలో శ్రీరామనవమి పూజ చేయడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున అర్చనలు, ప్రత్యేక పూజలు కూడా చేయొచ్చు.
- దశమి తిథి వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి. ఏవైనా సమస్యలు ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించండి.
- ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. నిమ్మకాయ నీరు, లేత కొబ్బరి, మజ్జిగ, గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది.
- మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని వాల్ నట్స్, బాదం పప్పులను స్నాక్స్ గా తినండి. ఇవి మీకు ఆకలి కాకుండా, మీరు బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి.
- ఈ రోజు ఎవరినీ మోసం చేయకూడదు. నిజాయితీగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి.
ఈ పవిత్రమైన రోజున చేయకూడని పనులు
- మాంసాహారం, ఆల్కహాల్ ను తీసుకోకూడదు.
- ఈ సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూరల్లో వేయకూడదు.
- నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం మంచిది కాదు.
- కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి. ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడటం మానుకోండి. కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా, ఉదారంగా ఉండండి.
- మీ భాగస్వామిని మోసం చేసి ప్రేమను పంచుకోవద్దు. అలాగే ఇతరులకు ద్రోహం తలపెట్టొద్దు.
