కుటుంబంలోని తాత, ముత్తాతలకు శరీరంపై వెంట్రుకలు దట్టంగా పెరిగితే.. వారి సంతానంలోని పురుషులకు కూడా ఇదే లక్షణం వచ్చేందుకు అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

చాలా మంది పురుషులకు ఛాతిపై వెంట్రుకలు ఉంటాయి. అలా వెంట్రుకలు ఉండటాన్ని మగతనంగా భావించేవారు కూడా ఉన్నారు. చాలా మంది అమ్మాయిలకు కూడా.. అలా ఛాతి మీద వెంట్రుకలు ఉండే అబ్బాయిలను బాగా ఇష్టపడతారు. అయితే.. అలా పురుషుల ఛాతిపై వెంట్రుకల విషయంలోనూ ఓ ప్రత్యేకత ఉంది.

శరీరంలోని ఏ భాగంలోనైనా  పుట్టుమచ్చలు ఉండటం, గోళ్లకు ఉండే సహజరంగు, ఛాతీపై వెంట్రుకలు, చెంపపై పుట్టుమచ్చ, స్త్రీ ఛాతీపై పుట్టుమచ్చ మొదలైనన్నీ ఏదో ఒక లక్షణానికి సంకేతంగా భావిస్తారు. ఈ కోవలోనే పురుషుల ఛాతీ పెరిగే వెంట్రుకలు అతని అదృష్టాన్ని, స్వభావాన్ని సూచిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ నేపధ్యంలో పురుషుల శరీరంపై వెంట్రుకలు పెరుగుతాయి. 

Also Read:భార్యాభర్తలిద్దరూ జీవితాంతం అన్యోన్యంగా ఉండాలంటే పాటించవలసిన సూత్రాలు ఇవే!

పురుషులకు సాధారణంగా 14-15 ఏళ్ల వయసులో ముఖంపై వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. పురుషుల శరీరంలో హార్మోన్స్ విడుదల కారణంగా శరీరంపై వెంట్రుకలు మొలుస్తాయి. అయితే ఇది ఆ వ్యక్తి డీఎన్ఏపై ఆధారపడివుంటుంది. కుటుంబంలోని తాత, ముత్తాతలకు శరీరంపై వెంట్రుకలు దట్టంగా పెరిగితే.. వారి సంతానంలోని పురుషులకు కూడా ఇదే లక్షణం వచ్చేందుకు అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

Also read:అందమైన పెదాల కోసం ఈ 6 చిట్కాలు ట్రై చేసి చూడండి..?

శరీరంపై వెంట్రుకల పెరుగుదల అనేది అని టెస్టోస్టెరాన్‌పై ఆధారపడివుంటుంది. ఈ టెస్టోస్టెరాన్‌లో ఆండ్రోజెన్ మోతాదు అధికంగా ఉంటే శరీరంలోని ఛాతీపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఏ పురుషుని శరీరంపై అధికంగా వెంట్రుకలు పెరుగుతాయో.. అతను మిగిలిన పురుషుల కన్నా అదృష్టవంతుడు. శరీరంపై అత్యధికంగా వెంట్రుకలు ఉన్న పురుషులు ప్రత్యేకంగా కనిపిస్తారు. 

Also Read: ఈ సమస్యలు ఉన్నవారు... కలబందకి దూరంగా ఉండాలి..!

ఇటువంటి పురుషులు ఇతరులను ఆదరించడంలోనూ, నిజాన్ని మాట్లాడటంలోనూ ముందుంటారు. జీవితంలోని చాలా విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఛాతీపై అత్యధికంగా వెంట్రుకలు కలిగిన పురుషులు ఎంతో కష్టపడి పనిచేసేవారిగా గుర్తింపు పొందుతారు. అందరి నమ్మకాన్ని సంపాదించుకుంటారు. మోసం చేసేందుకు వెనుకాడతారు. మంచి నాయకత్వ లక్షణాలను కలిగివుంటారు. అందరితో కలసిపోయి ముందుకుసాగే ప్రయత్నం చేస్తుంటారు. సమాజంలో ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. 

Also Read: దీపావళి గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే...

అయితే.. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు మాత్రమే కాదు.. అమ్మయిలు కూడా వెంట్రుకలను తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. మార్కెట్లోకి దీనికి సంబంధించి రకరకాల వస్తువులు, క్రీములు లాంటివి లభిస్తుండటం గమనార్హం. దీంతో.. వాటిపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. చాలా మంది బాలీవుడ్ హీరోలు కూడా ఛాతి మీద వెంట్రుకలను పెంచడాన్ని పెద్దగా ఇష్టపడరు. కానీ..  అలా ఛాతి మీద వెంటుక్రలు.. మగవారిని అందంగా కనిపించేలా చేస్తాయట.  చాలా మంది అమ్మాయిలు అలానే ఉండటాన్నే కోరుకుంటారట.  కాబట్టి.. వాటిని తొలగించడం కంటే.. ఉంచుకోవడమే బాగుంటుందేమో..? అయినా.. ఈ తరం కుర్రాళ్లు.. క్రేజ్ ని పట్టి ఫాలో అవుతుంటారు.