పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె, పెట్రోలియం జెల్లీలు ప్రయోజనకరంగా ఉంటాయి. అలా అని రెండింటినీ పెట్టుకోలేం. ఏదో ఒక దాన్ని మాత్రమే ఉపయోగించాలి. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే?
కొబ్బరి నూనె, పెట్రోలియం జెల్లీ.. ఈ రెండూ మంచి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కానీ చాలా మంది కొబ్బరి నూనెనె ఎక్కువగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె కాదు పెట్రోలియం జెల్లీ కూడా మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. డ్రై స్కిన్, పగిలిన పెదాలకు ఇది బాగా సహాయపడుతుంది. ఈ రెండు ప్రయోజకరంగానే ఉంటాయి. అందుకని ఈ రెండింటినీ ఒకేసారి ఉపయోగించలేం. నిపుణుల ప్రకారం ఈ రెండింలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం..
పెట్రోలియం జెల్లీ అంత మంచిది కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది చమురు శుద్ధి కి బై ప్రొడక్ట్. ఇవి పర్యావరణానికి కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే కొబ్బరి నూనె ఎండిన కొబ్బరి నుంచి తయారవుతుంది. ఇది సహజ నూనె. శుద్ధి చేసిన లేదా శుద్ధి చేయని కొబ్బరి నూనెను ఉపయోగించినా మంచిదే. కొబ్బరి నూనెను మీ శరీరమంతా అప్లై చేయడం వల్ల సహజంగా మీ చర్మం తేమగా ఉంటుంది. మీ జీవక్రియను కూడా పెంచుతుంది. కాబట్టి కొబ్బరినూనె ముఖానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పెట్రోలియం జెల్లీ ప్రయోజనాలు
పగిలిన పెదవులు
పొలుసుల చర్మం
డైపర్ దద్దుర్లు
మోచేతులు, మోకాళ్ళు వంటి ప్రాంతాలను తేమను ఉంచడానికి కూడా పెట్రోలియం జెల్లీ సహాయపడుతుంది. అయితే మినరల్ ఆయిల్, పెట్రోలియం జెల్లీలు నిజంగా మాయిశ్చరైజర్లు కావని నిపుణులు చెబుతున్నారు. తేమ చర్మం నుంచి బయటకు రాకుండా ఉండటానికి ఇవి అవరోధంగా మాత్రమే పనిచేస్తాయి.
కొబ్బరి నూనె ప్రయోజనాలు
కొబ్బరి నూనెలో లినోలెయిక్ ఆమ్లం, లారిక్ ఆమ్లం వంటి కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ నూనె చర్మాన్ని మృదువుగా చేయడానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పెట్రోలియం జెల్లీ వల్ల వచ్చే సమస్యలు
పెట్రోలియం జెల్లీ ఎన్నో ప్రయోజనాలను కలిగించినప్పటికీ.. దీనిని ఎక్కువ కాలం ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది మీ ముఖంపై ముడతలకు కారణం కావొచ్చు. మీకు తరచుగా మొటిమలు అయితే పెట్రోలియం జెల్లీని ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రంధ్రాలను అడ్డుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది మొటిమలను రెట్టింపు చేస్తుంది. అందుకే దీనికి బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించండి.