బరువు తగ్గాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. అన్ని కాలాలలో కెల్లా.. ఎండా కాలం సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే...సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎండాకాలంలో శరీరం చమట ద్వారా ఎక్కువ మొత్తంలో నీటిని, ఖనిజ లవణాలను కోల్పోతుంది. కాబట్టి తరచూ నీటితోపాటు.. పానియాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే కూల్ డ్రింక్స్ లాంటివి కాకుండా కొబ్బరినీళ్లు, నిమ్మకాయ నీళ్లు, ఫ్రూట్ జ్యూస్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. 

ఇలా నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా తాజా పండ్లు, కూరగాయల ముక్కలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో.. త్వరగా ఆకలిగా అనిపించదు. ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. సులభంగా బరువు కూడా తగ్గుతాం.

ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా, ద్రాక్ష, కీర, బీర, సొర వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. పెరుగులో పండ్లు, కూరగాయ ముక్కలు కలిపి తీసుకుంటే..కడుపు హాయి గా ఉంటుంది. ఆకలి త్వరగా వేయదు.