ప్రెగ్నెన్సీ రావాలంటే... కలయిక తర్వాత ఇలా చేయాలి
పెళ్లైన దంపతులందరూ తమ జీవితంలోకి మరో చిన్నారిని ఆహ్వానించాలని కోరుకుంటారు. చిన్నారులు ఉండే ఇళ్లు.. ఎంతో ఆనందంగా ఉంటుంది.
పెళ్లైన దంపతులందరూ తమ జీవితంలోకి మరో చిన్నారిని ఆహ్వానించాలని కోరుకుంటారు. చిన్నారులు ఉండే ఇళ్లు.. ఎంతో ఆనందంగా ఉంటుంది. పాపాయి బోసి నవ్వులు.. కేరింతలు కోరుకోని వారు ఉండరు. అయితే... దంపతులు చేసే కొన్ని చిన్ని చిన్న పొరపాట్ల కారణంగా గర్భం రావడం ఆలస్యం అవుతుందంటున్నారు నిపుణులు.
చాలా మంది దంపతులు పిల్లలు కలగడం లేదని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిలో కొందరికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుపోయినా.. సంతానం కలగడం ఆలస్యమౌతూ ఉంటుంది. అలా జరగడానికి దంపతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ ఆ పొరపాటు ఏంటంటే.. కలయిక తర్వాత స్త్రీ, పురుషులు తమ జననాంగాలను శుభ్రం చేసుకుంటారు. అలా చేసుకోవాలి కూడా. కలయిక తర్వాత శుభ్రం చేసుకోకపోతే.. ఇరువురికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పురుషులు వెంటనే శుభ్రం చేసుకుంటే పర్లేదు.కానీ.. పిల్లలు కావాలనుకుంటున్నవారు మాత్రం స్త్రీలు కలయిక జరిగిన వెంటనే శుభ్రం చేసుకోకూడంటున్నారు నిపుణులు.
కలయిక వెంటనే నీటితో శుభ్రం చేస్తే.. వీర్యం మొత్తం బయటకు వెళ్లిపోతుంది. దీంతో ప్రెగ్నెన్సీ రావడం కుదరదు. కాబట్టి... వెంటనే కాకుండా కలయిక తర్వాత ఒక గంట ఆగి నీటితో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. సంతానం అవసరం లేదు అనుకునే వారు మాత్రం వెంటనే శుభ్రం చేసుకోవచ్చు.