యూరిక్ యాసిడ్ ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయి.
ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వాటిని నియంత్రించాలి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
చక్కెర, తీపి పానీయాల వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ముఖ్యంగా విటమిన్ సి ఉండే ఆహారాలు. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకుని, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి దానికి దూరంగా ఉండాలి.
2 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్
చలికాలంలో జుట్టు రాలకుండా ఈ చిన్న పని చేయండి
రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
మగువలు మెచ్చే చున్రీ చీరలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో