చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ...  ప్రస్తుత రోజుల్లో చేసే పని.. సెల్ఫీ దిగడం. కొందరు సందర్భానుసరంగా సెల్ఫీలు దిగితే.. మరికొందరికీ మాత్రం సెల్ఫీలు దిగడం మాత్రమే పని.  ఉదయం లేచినదగ్గర నుంచి రకరకాల ఫోజుల్లో సెల్ఫీలు దిగుతూ ఉంటారు.  అయితే.. ఇలా తరచూ సెల్ఫీలు దిగేవారికి కొత్తరకం జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సెల్ఫీ ప‌ర్‌ఫెక్టుగారావాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డుతూ శ‌రీరాన్ని, మోచేతిని అటూఇటు వంచేస్తుంటారు చాలామంది. అలా చేసేవారికి సెల్పీ ఎల్బో ముప్పుందంటున్నారు నిపుణులు. సెల్ఫీలు తీసుకుంటున్న‌పుడు మోచేతిపై ప‌డే ఒత్తిడి కార‌ణంగా అదొక ఆరోగ్య స‌మ‌స్య‌గా మారుతుంద‌ని అమెరికాకు చెందిన నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సెల్ఫీ స్టిక్‌తో సెల్ఫీలు తీసుకునే వారికి కూడా ఈ ముప్పు త‌ప్ప‌దంటున్నారు. 

టెన్నిస్‌, గోల్ఫ్ ఆడేవారికి ఎలాగ‌యితే మోచేతి స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇదీ అలాంటిదేన‌ని చెబుతున్నారు. సెల్ఫీలు మ‌రీ ఎక్కువ‌గా తీసుకుంటున్న‌పుడు కండ‌రాల మీద ఒత్తిడి ప‌డి మోచేతి ప్రాంత‌మంతా వాపుకి గుర‌వుతుందంటున్నారు. అందువలన సెల్ఫీలకు దూరంగా ఉంటేనే మంచిదని వారు సూచిస్తున్నారు.