sankranthi 2022: సంక్రాంతి వచ్చింది తుమ్మెదా.. సరదాలు తెచ్చింది తుమ్మెదా.. అంటూ పల్లెలు, పట్టణాల్లో తేడా లేకుండా ఇళ్లల్లో పండగ శోభ ఉట్టిపడుతుంటుంది. ఇంటి నిండా చుట్టాలతో.. గుమ గుమ లాడే వంటకాలతో.. ముక్కు పుటలు అదిరిపోయే కమ్మనైనా స్వీట్స్ సువాసనలు, గుమగుమల వాసనను వెదజల్లే పిండి వంటకాలతో ఇండ్లన్నీ మనసును పరవశింపజేసే సువాసనతో నిండిపోతాయి. ఇక ఈ పండగ కోసం వారం రోజుల నుంచే పిండి వంటలు వండేస్తుంటారు అమ్మలక్కలు. ఈ పండక్కి ఏ వంటలు చేయాలి. ఏ పిండి వంటలు చేయాలి. పిల్లలకు ఏవి నచ్చుతాయి.. ఏవి ఇష్టంగా తింటారు అని తెగ హైరనా పడిపోయే వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచిని అందించే ఈ పిండి వంటలు తయారుచేసి ఈ Festival ను బాగా ఎంజాయ్ చేయండి.

పట్టణాల్లో సంక్రాంతి పండగ వాతావరణం ఎలా ఉంటుందన్న సంగతి పక్కన పెడితే.. పళ్లెల్లో మాత్రం సంక్రాంతి పండుగను దూం.. దాం.. గా జరుపుకుంటారు. అందులోనూ సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు వారం రోజుల ముందు నుంచే పట్టణాలన్నీ ఖాళీ అయిపోతుంటాయి. పళ్లెల్లన్నీ సుట్టాలతో నిండి సందడి సందడిగా మారిపోతుంటాయి. చుట్టాల హడావుడి, భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు కీర్తనలు, సువాసనలు వెదజల్లె పిండి వంటకాలతో అందంగా మారిపోతుంటాయి. అయితే ఈ సంక్రాంతికి పిండి వంటలు ఏవి చేయాలో పాలుపోని వారు వీటిని చేయండి. ఈ పిండి వంటలు సంక్రాంతి స్పెషల్ వంటలుగా పేరు గాంచాయి. అందులోనూ ఈ వంటలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవి ఏవంటే..

సకినాలు.. నానబెట్టిన బియ్యపు పిండి నువ్వులు, వాము పదార్థాలతో సకినాలను తయారు చేస్తారు. వీటిని బ్రేక్ ఫాస్ట్ గా కూడా కొందరు తీసుకుంటారు. సుమారుగా నెల రోజుల వరకు నిల్వ ఉండే వీటిని పిల్లలతో పాటుగా పెద్దలు కూడా ఇష్టం ఆరగిస్తారు. అయితే వీటిని సంక్రాంతి వారం ఉందనగానే వీటినే Prepare చేస్తారు. ముందే చలికాలం.. ఆపై సంక్రాంతి పండగ. అందుకే కరకరలాడేలా ఈ సకినాలను తయారు చేస్తారు. అందులోనూ చలికాలం ఎలాంటి ఇన్ఫెక్షన్లు, రోగాలు రాకుండా ఉండేలా వాము, నువ్వులు కూడా వేస్తారు. నువ్వులు వేయడం వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇకపోతే వాము వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. so ఈ పండక్కి వీటిని తిని ఎంజాయ్ చేయండి.. ఆరోగ్యంగా ఉండండి.

నువ్వుల ఉండలు.. బెల్లం, నువ్వులను కలగలిపి చేసే ఈ ఉండలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ నువ్వుల ఉండల్లో Proteins, Vitamins పుష్కలంగా లభిస్తాయి. అందులోనూ బెల్లంలో Iron ఎక్కువగా ఉంటుంది. so చలికాలంలో ఈ నువ్వుల ఉండలను తింటే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నవారికి చక్కటి ఔషదంలా పనిచేస్తాయి.

జంతికలు.. ప్రతి పండగ స్పెషల్ వంటకంగా జంతికలు పేరు పొందాయి. ప్రాంతాలను బట్టి వీటిని రకరకాలు తయారుచేసినా.. ఆరోగ్యానికి మాత్రం ఇవి ఎంతో మేలు చేస్తాయి. బియ్యపు పిండి, శనగపిండి, కారం, ఉప్పు, వాము, నువ్వులతో వీటిని తయారు చేస్తారు. వీటిలో వాడే శనగపిండిలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ దీన్ని కొద్ది Quantityలోనే తీసుకోవాలి.
సున్నుండలు.. మినుములతో తయారుచేసే సున్నుండలు శరీరానికి ఎంతో బలాన్నిస్తాయి. వీటిలో ఉండే మినుములు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అందుకే ఈ లడ్డూలను కూడా సంక్రాంతి వంటకాల్లో చేర్చండి.