sankranthi 2022: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకమైనది. అందులోనూ హిందూ సాంప్రదాయం ప్రకారం సంక్రాంతికి, మరక సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించబడి ఉంది. ఈ పండుగను దేశంలో వివిధ రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండగకు దాన ధర్మాలు చేయడం, గంగా స్నానాలు, ఉపవాసాలు, వ్రతాలు చేస్తుంటారు. కాగా ఈ మకర సంక్రాంతి రోజున శని దేవుడిని, సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజిస్తుంటారు. ఇలా చేయడం వల్ల సుఖ సంతోషాలతో కుటుంబం ఆనందంగా వెళ్లి విరుస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. అందులోనూ స్యూర్య దేవుడికి పూజలు చేయడం వల్ల ప్రత్యేక ఫలం పొందుతామని ప్రజలు నమ్ముతారు.

పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున 14 రకాల వస్తువులను దానం చేస్తే పుణ్యం వస్తుందట. ముఖ్యంగా నువ్వులతో చేసిన పదార్థాలను మాత్రమే దానం చేస్తే చాలా మంచిది. మిగిలిన రోజుల్లో చేసిన దానానికి వచ్చిన ఫలితం కంటే ఈ మకర సంక్రాంతికి చేసిన ధానాల ఫలాలే ఎక్కువని జనాలు నమ్ముతారు. ఇకపోతే దేవుడు స్యూర్య భగవానుడికి ప్రత్యేకించి ఖరీఫ్ లో పండే వేరు శనగ, శనగ, వరి , నువ్వులు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలతోనే నైవేద్యంగా పెట్టాలని శాస్త్రం చెబుతోంది. సకల సంతోషాలను వెదజల్లె మకర సంక్రాంతి రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అవేంటంటే..?
మకర సంక్రాంతి రోజున కుదిరితే గంగా స్నానం చేయడం మంచిది. అది వీలు కాకపోతే నల్ల నువ్వులను నీటిలో కలుపుకుని ఇంట్లోనే స్నానం చేసినా మంచిదే. కాగా చాలా మంది ఈ పండక్కి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తారు. ఎందుకంటే శనిదేవుడి ప్రసన్నం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయని ప్రజలు భావిస్తారు. మీరు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మాత్రం నల్ల నువ్వులను ఇతరులకు దానం చేయండి. ఇకపోతే ఆ రోజు నల్ల నువ్వులను కలిపిన నీటిని తాగితే కూడా మంచి జరుగుతుందట. వీటితో పాటుగా నువ్వుల లడ్డూలను తింటే కూడా శుభాలు జరుగుతాయని భావిస్తారు. కిచిడీని ప్రసాదంగా తింటే కూడా చాలా మంచి జరుగుతుందట. సో మరక సంక్రాంతి రోజున కిచిడీని తినండి.
చేయకూడని పనులు: మరక సంక్రాంతి రోజున మీ ఇంటికి బిచ్చగాడు గానీ ఇతర ఎవరైనా రానీయండి సహాయం లేదా వేరే వాటికోసం వస్తే వారిని ఉట్టి చేతులతో పంపడం మంచిది కాదు. ఆహారం కానీ, వస్తువులు కానీయండి, మరేదైనా కానీయండి .. ఏదైనా ఇచ్చి పంపితే అంతా శుభాలే జరుగుతాయట. ముఖ్యంగా ఆ రోజు దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందట. మకర సంక్రాంతి ఎంతో పవిత్రమైనది కాబట్టి ఆ రోజు మద్యానికి దూరండా ఉండటం మంచిది. మద్యం, ఇతర మత్తు పదార్థాలకు ఆ రోజు ఎంత దూరంగా ఉంటామో అంత మంచి జరుగుతుందట. ఉపవాసాలు, వ్రతాలు చేసే వారు నిష్టగా కొన్ని నియమాలను పాటించాలి. స్నానం చేసే ముందు, పూజ చేసే ముందు ఆహారాన్ని తినకూడదని శాస్త్రం చెబుతోంది.