భారత్ లోని అతి పెద్ద జువెల్స్ సంస్థల్లో ఒక్కటైన రిలయన్స్ జువెల్స్... 12వ వార్షిక సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తమ ప్రియతమ కష్టమర్ల కోసం రిలయన్స్... సరికొత్త కలెక్షన్ తీసుకువచ్చింది. ఈ 12 వ వార్షికోత్సవాన్ని రిలయన్స్ తమ కష్టమర్లతో జరుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ‘‘ఆభార్’’ పేరిట కొత్త కలెక్షన్ ని ప్రారంభింది. దీనిలో కేవలం ఇయర్ రింగ్స్ మాత్రమే ఉంటాయి. 

మన జాతీయ పక్షి నెమలి ని ఆదర్శంగా తీసుకొని ఈ కలెక్షన్ ని ప్రారంభించారు. అందులో ఈ కెలక్షన్ లో లభించే అన్ని ఇయర్ రింగ్స్... దాదాపు నెమలి ఆకారాన్ని పోలి ఉంటాయి. సరికొత్త మోడల్స్ లో యువతను ఆకట్టుకునే విధంగా వీటిని తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

కేవలం ఇవే కాకుండా ఇందులో జుమ్కాలు, చందేరీలు, స్టడ్స్, చంద్ బాలీ మోడల్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి 22క్యారెట్స్, 18 క్యారెట్స్ బంగారంలో అందుబాటులో ఉన్నాయి. కేవలం బంగారమే కాదు.. డైమండ్స్ కూడా అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు  చెబుతున్నారు.  ప్రతి అకేషన్ కి సూటయ్యేలా ఈ కలెక్షన్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చినట్లు వారు  చెబుతున్నారు. 

బంగారం, డైమండ్ ఆభరణాల మేకింగ్ చార్జెస్ పై 24 శాతం తగ్గింపు ప్రకటిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ ఆఫర్  సెప్టెంబర్ 1, 2019 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రిలయన్స్ జెవెల్స్ 81 పట్టణాల్లో 200 పైగా స్టోర్స్ ని ఏర్పాటు చేసింది. ఈ స్టోర్స్ అన్నింటిలోనూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.

  ‘‘భారతదేశమంతటా   మాకు మద్దతు ఇచ్చిన మా వినియోగదారులందరికీ ఆబార్ కలెక్షన్స్ ద్వారా మీకు కృతజ్ఞతకు తెలియజేస్తున్నాం. రిలయన్స్ జ్యువెల్స్ ని ప్రజలు ఎంతగానో ఆదరించారు. ఒక స్నేహితుడు, బంధువు, జీవిత భాగస్వామి, కస్టమర్ లేదా పరిచయస్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి అబార్ కలెక్షన్స్ ఒక మార్గంగా మేము భావిస్తున్నాం’’ అని రిలయన్స్ జువెల్స్ అధికార ప్రతినిధి తెలిపారు.