Asianet News TeluguAsianet News Telugu

బియ్యానికి బెస్ట్ ప్రత్యమ్నాయాలు ఇవే.. వీటిని తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు..

బియ్యాన్ని ఎక్కువగా తింటే బరువు పెరగడంతో పాటుగా మరెన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే బియ్యానికి బదులు కొన్ని ఆహారాలను తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. 
 

Reduce your rice intake with these healthy alternatives rsl
Author
First Published Mar 27, 2023, 11:04 AM IST

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బియ్యాన్నే ఎక్కువగా తింటున్నారు. దీన్నే ప్రధాన ఆహార పదార్థంగా భావిస్తున్నారు. నిజానికి రైస్ కడుపును నింపినా.. దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవే మనకు ప్రధాన శక్తి వనరులు. అయినప్పటికీ.. అన్నాన్ని ఎక్కువగా తింటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే అన్నానికి బదులుగా వేరే ఆహార పదార్థాలను తిన్నా మీ శరీరానికి తగినంత శక్తి అందుతుంది. అలాగే కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. బియ్యానికి ఆరోగ్యకరమైన ప్రత్యమ్నాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

క్వినోవా

క్వినోవా ప్రోటీన్లకు ఒక గొప్ప వనరు. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది బియ్యానికి మంచి ప్రత్యామ్నాయం. ఇది రుచిగా కూడా ఉంటుంది. అందుకే దీన్ని ఎన్నో వంటకాల్లో చేర్చొచ్చు. క్వినోవాలో గ్లూటెన్ ఉండదు. అలాగే దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. 

కౌస్కస్

ఉత్తర ఆఫ్రికా వంటకాల్లో కౌస్కస్  ప్రాథమిక ఆహార పదార్థంగా పరిగణించబడుతోంది. ఇది durum wheat నుంచి తయారవుతుంది. ఇవి తేలికగా, మెత్తటి ఆకృతిని కలిగి ఉంటాయి. కౌస్కస్ కార్బోహైడ్రేట్లకు గొప్ప మూలం. దీనిలో కొవ్వు కంటెంట్ తక్కువగా ఉంటుంది.

బుల్గుర్

క్రాక్డ్ గోధుమలను బుల్గుర్ అని కూడా పిలుస్తారు. దీన్ని మధ్యప్రాచ్య వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది బియ్యానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. 

ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే చిరుధాన్యాలు

చిరుధాన్యాల్లో గ్లూటెన్ అసలే ఉండదు. వీటిని రకరకాల సలాడ్లు, గంజితో సహా వివిధ రకాల వంటలలో ఉపయోగించొచ్చు. చిరుధాన్యాలలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. 

బార్లీ

బార్లీ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఎక్కువగా ఉండే పోషకమైన ధాన్యం. బార్లీ టేస్ట్ బాగుంటుంది. దీన్ని సూప్లు, పులుసు, కాసెరోల్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. 

బుక్వీట్

బుక్వీట్ లో కూడా గ్లూటెన్ ఉండదు. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది. ఇది నట్టి రుచిని కలిగి ఉంటుంది. పాన్ కేక్ లు, నూడుల్స్ లో సహా వివిధ రకాల వంటలలో దీనిని  ఉపయోగించొచ్చు. బుక్వీట్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి గొప్ప ఎంపిక.

వైల్డ్ రైస్

ఈ వైల్డ్ రైస్ ఉత్తర అమెరికాకు చెందింది. ఈ అడవి బియ్యం నట్టి రుచికి ప్రసిద్ధి చెందిన గడ్డి జాతికి సంబంధించినవి. వైల్డ్ రైస్ లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది బియ్యానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. 

ఈ ప్రత్యామ్నాయాలలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన ధాన్యాలను మీ భోజనంలో చేర్చడానికి ప్రయత్నించండి. ఇవి ఎన్నో రోగాల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios