Asianet News TeluguAsianet News Telugu

మూడు వేల పెట్టుబడితో బిజినెస్.. 19 మందికి ఉపాధి కల్పించిన మహిళ!

కష్టపడే తత్వం ఉంటే డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ప్రస్తుతమున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల బిజినెస్ లను ప్రారంభించి నెలకు లక్షల్లో ఆదాయాన్ని తీసుకుంటున్నారు. ఇలా ఎంతోమంది స్వయం ఉపాధితో జీవితంలో ముందుకు రావడమే కాకుండా మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలా ప్రశంసలు అందుకుంటున్న వారిలో పూణేకి చెందిన మేఘన బఫ్నా.ఈమె మూడు వేల రూపాయలతో తన వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు సంవత్సరానికి ఏకంగా 15 లక్షలకు పైగా ఆదాయాన్ని తీసుకుంటుంది. మరి ఈమె చేస్తున్న బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే...
 
Pune women started her own business and earns lakhs full details inside
Author
Hyderabad, First Published Aug 6, 2022, 3:43 PM IST

కష్టపడే తత్వం ఉంటే డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ప్రస్తుతమున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల బిజినెస్ లను ప్రారంభించి నెలకు లక్షల్లో ఆదాయాన్ని తీసుకుంటున్నారు. ఇలా ఎంతోమంది స్వయం ఉపాధితో జీవితంలో ముందుకు రావడమే కాకుండా మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలా ప్రశంసలు అందుకుంటున్న వారిలో పూణేకి చెందిన మేఘన బఫ్నా.ఈమె మూడు వేల రూపాయలతో తన వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు సంవత్సరానికి ఏకంగా 15 లక్షలకు పైగా ఆదాయాన్ని తీసుకుంటుంది. మరి ఈమె చేస్తున్న బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే...

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది విపరీతమైన శరీర బరువు పెరుగుతున్నారు. అయితే శరీర బరువు తగ్గించడంలో సలాడ్లు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ క్రమంలోనే చాలామందికి ఇంట్లో సలాడ్ తయారు చేసుకునే అంత సమయం ఓపిక లేకపోవడం గమనించిన మేఘన సలాడ్ బిజినెస్ చేయాలని ప్రారంభించారు.ఈ క్రమంలోనే మూడు వేల రూపాయలతో తన బిజినెస్ ప్రారంభించిన ఈమె మొదట్లో కొన్ని నష్టాలను ఎదుర్కొన్నారు.వ్యాపారం అన్న తర్వాత లాభనష్టాలు సర్వసాధారణం అయితే మేఘన మాత్రం నష్టాలను చూసి వెనకడుగు వేయకుండా నష్టాలను భరిస్తూ ముందుకు నడిచింది.

ఇలా ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి మార్కెట్ వెళ్లి తాజా కూరగాయలను తీసుకువచ్చి ఈమె సలాడ్లు తయారు చేసేది. మొదట్లో తన ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలోనూ అలాగే స్నేహితులు ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈమె సలాడ్లు తయారు చేసి వారికి ఇచ్చేది.సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈమె తన బిజినెస్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకున్నారు. ఇలా పూనేలోనే ప్రస్తుతం ఈమె వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఈమెకు ఇతర ప్రాంతాల నుంచి అలాగే ఇతర సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడం గమనార్హం.

ఈ విధంగా మేఘన బఫ్నా ప్రస్తుతం నెలకు 75 నుంచి 1,50,000 వరకు సంపాదిస్తున్నారు. అయితే ఈమె వ్యాపారంలో ముందుకు వెళ్లడమే కాకుండా తన దగ్గర పని చేయడం కోసం 19 మందిని నియమించుకున్నారు. ఇలా ఈమె 19 మందికి ఉపాధి కల్పిస్తూ వ్యాపార రంగంలో ముందుకు వెళ్లడం అధిక లాభాలను ఆర్జించడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పాలి. సాధించాలని పట్టుదల సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చని మేఘన బఫ్నా నిరూపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios