ముఖం అందంగా, మృదువుగా, కాంతివంతంగా ఉండడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఖరీదైన క్రీములు వాడుతుంటారు. కానీ స్నానం చేసేముందు ఈ చిట్కాలు పాటిస్తే చాలు. ఎలాంటి క్రీములు అవసరం లేకుండా ముఖం అందంగా మారిపోతుంది! అవెంటో తెలుసుకోండి.

ముఖం మృదువుగా, తేమగా ఉండడానికి ఖరీదైన క్రీములే రాయాల్సిన అవసరం లేదు. చర్మానికి మేలు చేయడంతో పాటు సహజంగా దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 

ముఖ్యంగా కొందరికీ స్నానం చేసిన తర్వాత చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంటుంది. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ముఖాన్ని సహజంగా తేమగా ఉంచుకోవచ్చు. ఆ చిట్కాలెంటో ఓసారి చూసేయండి మరీ.

ముఖానికి తేనె అప్లై చేస్తే ఏమవుతుంది?

తేనె మీ చర్మాన్ని సహజంగా హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మానికి సమర్థవంతంగా మెరుపును తెస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తాయి. స్నానానికి ముందు కొన్ని చుక్కలు చేతిలో వేసుకుని మసాజ్ చేసుకోవాలి. అది మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.

నిమ్మరసం

చర్మం విషయంలో నిమ్మరసం కూడా బాగా సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ సి లక్షణాలు చర్మాన్ని బిగుతుగా చేయడానికి సహాయపడతాయి. మీరు చేయాల్సిందల్లా 5 నుంచి 10 నిమిషాల పాటు మీ ముఖానికి నిమ్మరసాన్ని అప్లై చేసి, ఆపై శుభ్రమైన నీటితో కడగాలి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

ఆలివ్ ఆయిల్

స్నానానికి ముందు ముఖానికి ఆలివ్ ఆయిల్ రాసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మంపై వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది. అయితే, మీ చర్మం సున్నితంగా లేదా జిడ్డుగా ఉంటే, ఈ నూనెను ఉపయోగించకండి. 

టొమాటో రసం

మీరు మీ చర్మానికి టొమాటో రసం కూడా అప్లై చేయవచ్చు. ఇది హానికరమైన సూర్య కిరణాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది, చర్మానికి తాజాదనాన్ని, దృఢత్వాన్ని అందిస్తుంది. మచ్చలను పొగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది.

శనగపిండి

స్నానం చేయడానికి ముందు శనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ చర్మాన్ని బాగా ఎక్స్‌ఫోలియేట్ చేయవచ్చు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.