High BP: హై బీపీ సమస్యతో నుంచి బయటపడటానికి శాశ్వత పరిష్కార మార్గం లేదు. కానీ కొన్ని మందులు, ఆహార పదార్థాల ద్వారా మాత్రం ఈ సమస్యను నియంత్రించవచ్చు. అయితే ఈ సమస్య ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. లేదంటే ప్రమాదంలో పడ్డట్టే..
High BP: హై బీపీ సమస్య ఉన్న వారు ఫుడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు వీరి బీపీని అమాంతం పెంచుతాయి. మన బీపీని 120/80 గా పరిగణిస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ బీపీ అంతకు మించితే బీపీ తగ్గుతుంది. ఆ సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే గుండె ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు బీపీ పేషెంట్లు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే వీరు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అప్పుడే వారి బీపీ కంట్రోల్లో ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కెఫిన్: హై బీపీతో బాధపడేవారు కెఫిన్ కు దూరంగా ఉంటేనే క్షేమంగా ఉంటారు. ముఖ్యంగా సోడా, కాఫీ వంటి వాటికి వీరు చాలా దూరంగా ఉండాలి. ఇదే వారికి వారి ఆరోగ్యానికి మంచిది.
2. సుగంధ ద్రవ్యాలు: మసాలాలు బీపీని పెంచడంలో ముందుంటాయి. అందుకే అధిక మసాలాలు, స్పైసీ ఫుడ్ కు బీపీ పేషెంట్లు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మసాలా ఫుడ్ తినాలనుంటే తక్కువ మోతాదులో మసాలాలు ఉండే వాటిని తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు.
3. ఉప్పు: ఉప్పు మోతాదుకు మించితే ఎంత డేంజరో మనకు తెలుసు. ఇక అధిక బీపీ సమస్య ఉన్న వారికి ఉప్పు విషంతో సమానం. ఎందుకంటే ఈ సమస్య ఉన్న వారు ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది.
4. షుగర్: హై బీపీతో బాధపడేవారు తీపి పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మూలంగా ఊబకాయం బారిన పడతారు. ఇలా అయితే మీ బీపీ మరింత పెరిగే ప్రమాదం ఉంది.
5. ప్యాకెట్ ఫుడ్: బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉండే వారు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫుడ్ లో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాగా ఈ సోడియమే రక్తపోటుకు దారి తీసే ప్రధాన కారణం.
