ప్రస్తుతం డెంగీ కాలం నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది డెంగీ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే... ఈ డెంగీ వ్యాధి కారణంగా మార్కెట్లో బొప్పాయి రేటు భారీగా పెరిగిపోయింది. డెంగీకి, బొప్పాయి పండుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? సంబంధం ఉంది.  డెంగీ నియంత్రణకు బప్పాయి ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో... నగరంలో దీని డిమాండ్ పెరిగిపోయింది. 

డెంగీ కారక దోమల ఉధృతి నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డెంగీకి ప్రత్యేకించి ఔషదాలు ఏమీ లేవని.. జ్వరాన్ని  నియంత్రించడం ఒక్కటే మార్గమని పలువురు పేర్కొంటున్నారు. అయితే.. బొప్పాయి పండు తినడం ద్వారా డెంగీ వ్యాధిని నివారించవచ్చని వైద్యులుచెబుతున్నారు.  ఈ కారణంగానే బొప్పాయి రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

దీని గురించి ఓ వ్యాపారస్తుడు మాట్లాడుతూ.. బొప్పాయిలో విటమిన్లు పుష్కలంగా ఉండడంతో వీటి డెంగీ పీడితులకు ఈ రసం తాగించాలని డాక్టర్లు సూచిస్తుండటంతో వినియోగం బాగా పెరిగిందన్నారు. గతంలో మార్కెట్‌కు రోజుకు 10 నుంచి 15 ట్రక్కుల బొప్పాయి సరఫరా కాగా, ప్రస్తుతం రోజుకు 40 ట్రక్కుల వరకు సరఫరా అవుతోందని ఆయన వివరించారు.