మనలో ఉన్న చాలా మంది న్యూఇయర్ సందర్భంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. పాత ఏడాదిలో చేసిన తప్పులను కొత్త ఏడాది చేయకూడదని.. చెడు అలవాట్లు మానేయాలనుకుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి పొగతాగడం మానేయడం.

అయితే ఇలాంటి వారు క్రమక్రమంగా మద్యం తాగడం కూడా మానేస్తారని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మందుబాబులపై జరిపిన పరిశోధనల్లో భాగంగా సిగరేట్ వినియోగం ముఖ్యంగా మద్యం సేవించే వారిలో ఎక్కువగా ఉంటుందని.. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనడానికి 22 మందిపై పరిశోధన చేశారు.

మద్యం మానేయడానికి చికిత్స పొందుతున్న వారి నికోటిన్ మెటబోలైట్ నిష్పత్తి, నికోటిన్ మెటబాలిజం ఇండెక్స్‌ను అధ్యయనం చేయగా... వారంలో సగటున 29 నుంచి 7 వరకు వీరి నికోటిన్ మెటబోలైట్ రేట్ తగ్గేలా చేశారు. దీంతో మద్యపానం సేవించడం తగ్గిపోయింది.

నికోటిన్ మెటబాలిజం రేషియో అధికంగా ఉన్న మందుబాబులు ఎక్కువ పొగతాగుతారని, ఎక్కువ సమయం పొగతాగడానికే కేటాయిస్తారని అధ్యయనంలో తేలింది. నికోటిన్ మెటబాలిజం రేషియో తగ్గించడం ద్వారా పొగతాగే అలవాటును మాన్పించవచ్చని ప్రొఫెసర్ సారా డెర్‌మోడీ తెలిపారు. నికోటిన్ జీవక్రియను మారుస్తుందని ధూమపానం, మద్యపానం మానేయడానికి నికోటిన్ మెటబోలైట్ దోహాదపడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు నికోటిన్ అండ్ టోబాకో రీసర్చ్ జర్నల్‌లో కథనాన్ని ప్రచురించారు.