Obesity in Men: ఎముకల ఆరోగ్యానికి Obesity దగ్గరి సంబంధం ఉందని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సమస్య ఆడవారిలో కంటే .. మగవారిలో ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Obesity in Men: నేటి ఆధునిక కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. కాగా అధిక బరువు ఉన్నవారికి అనేక అనారోగ్య సమస్యలు అటాక్ చేసే ప్రమాదముందని మనందరికీ ఇది వరకే తెలుసు. ఇక తాజా పరిశోధన ప్రకారం.. obesityకి ఎముకల ఆరోగ్యానికి సంబంధం ఉందని వెల్లడైంది. ముఖ్యంగా ఈ సమస్యలు ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయాలను అమెరికన్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఎవరి శరీరంలో అయితే కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుందో వారిలోనే ఎముకల సాంద్రత తక్కువ మొత్తంలో ఉందని తేల్చి చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఎముకల ఆరోగ్యం అధిక బరువుతో సంబంధం కలిగి ఉందని తేలింది.
ఈ విషయంపై పరిశోధన చేసేందుకు 60 ఏండ్ల లోపున్న 11 వేల మందిని సెలక్ట్ చేసుకున్నారు. వీరిపై పరిశోధన జరిపే ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెళ్లడించారు. ఈ విషయం In the Journal of Clinical Endocrinology and Metabolism of the Endocrine Society రీసెర్చ్ పేపర్ లో ప్రచురితమైంది. దీని ప్రకారం.. 60 సంవత్సరాల లోపు వయస్సున్న 10,814 మందిలో Bone mineral densityని పై విశ్లేషణ జరిపారు. ఆ తర్వాతే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇందుకోసం 2011 నుంచి 2018 వరకు US National Health and Nutrition Testing Survey గణాంకాలను పరిశీలించారు. వీటి ప్రకారం.. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకునే వారిలోనే ఎముకలు బలహీనంగా మారినట్టు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు ఈ సమస్య ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా ఉందని University of Chicago School of Medicine in Illinois ఎండీ రాజేశ్ జైన్ అన్నారు.
కాగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన ఎముకల ఖనిజ సాంద్రతతో సానుకూల సంబంధం ఉంటుందని అధ్యయనం తేల్చి చెప్పింది. ఇది మగవారికే కాదు ఆడవారికి కూడా వర్తిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అదే కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకల ఖనిజ సాంద్రతపై చెడు ప్రభావం పడుతుందనిన వారు పేర్కొంటున్నారు. అంతేకాదు ఊబకాయం సమస్యతో బాధపడేవారు అధిక కొవ్వు ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల వారికి osteoporosis screening అనే రోగం వస్తుందని హెల్త్ కేర్ ప్రొవైడర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచి కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలనే తీసుకోండి.
