ఫ్యాట్ గా ఉన్న మీరు ఫిట్ గా మారాలి అంటే 2025లో ఏం చేయాలి? ఏం తినాలి అనేది ఇప్పుడు చూద్దాం...

మనలో చాలా మంది న్యూ ఇయర్ అనగానే కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం నుంచి వాటిని పాటించాలి అని అనుకుంటారు. వాటిలో ఎక్కువ మంది కామన్ గా పెట్టుకునే రెజల్యూషన్ బరువు తగ్గడం. మరి ఈ డ్రీమ్ ని మీరు నిజం చేసుకోవాలంటే,.. ఫ్యాట్ గా ఉన్న మీరు ఫిట్ గా మారాలి అంటే 2025లో ఏం చేయాలి? ఏం తినాలి అనేది ఇప్పుడు చూద్దాం...

1.చిన్నపాటి వర్కౌట్స్...
బరువు తగ్గాలనే కోరిక ఉంటే సరిపోదు. దానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఒకేసారి కష్టమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. చిన్నపాటి వ్యాయామాలతో మొదలుపెట్టండి. ప్రతిరోజూ ఉదయం లేవగానే.. కనీసం 10 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నెమ్మదిగా ఆ సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఇలా చేయడం వల్ల మన శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. స్టిఫ్ నెస్ తగ్గుతుంది. రోజంతా యాక్టివ్ గా ఉండటానికి కూడా సహాయపడుతుంది. వర్కౌట్స్ వీలు కాదు అంటే నడక కూడా మంచిదే.

2.అల్పాహారంలో ఏం తినాలి?


చిన్నపాటి వ్యాయామాలు, లేదంటే నడక తర్వాత కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలి. బరువు తగ్గాలి అని తినడం మానేయకూడదు. కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తినాలి. కానీ.. పోషకాలతో ఉండాలి. మీ బ్రేక్ ఫాస్ట్ ని ప్రోటీన్ తో మొదలుపెట్టాలి. ప్రోటీన్ తీసుకున్న తర్వాత కూరగాయలు తింటారా? కార్బ్స్ తింటారా అనేది మీ ఇష్టం. కానీ ప్రోటీన్ తోనే మొదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల అక్కడే చాలా వరకు ఆకలి తగ్గుతుంది. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కార్బ్స్ తక్కువ తినే అవకాశం ఉంటుంది. ప్రోటీన్ లో గుడ్డు, పప్పులు, పన్నీర్ ఏవైనా తీసుకోవచ్చు. రోజుకొకటి తినడం ఇంకా మంచిది.

3.మరో వ్యాయామం...


ఉదయం లేవగానే వ్యాయామం చేశాం కదా మళ్లీ తిన్న తర్వాత చేయాలా అని కంగారు పడకండి. ఉదయం మీరు చిన్నపాటి వ్యాయామాలు చేశారు. ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకోవాలి. అంటే.. ఊడవడం, తుడవడం, లేదంటే ఫోన్ మాట్లాడుతూ నడవడం, మెట్లు ఎక్కి దిగడం లాంటివి చేయాలి. ఇవి కూడా మీ బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి.

4.ఫిట్నెస్ అడ్వెంచర్..


ప్రతిరోజూ ఒకే ప్లేస్ లో వ్యాయామం చేయాలి అంటే మీకు బోరింగ్ గా అనిపించొచ్చు. కాబట్టి.. నెలకొకసారి అయినా.. ఫిట్నెస్ అడ్వెంచర్లకు వెళ్లాలి. ట్రెక్కింగ్, రన్నింగ్, సైక్లింగ్ లాంటివి ఛాలెంజ్ తీసుకొని చేయాలి. ఇవి మిమ్మల్ని ఫిట్ గా మార్చడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎక్కువ మందితో కలిసి చేస్తారు కాబట్టి.. మంచి మోటివేషన్ లా కూడా ఉంటుంది.

5.80-20 రూల్ ఫాలో అవ్వాలి..


ఇక భోజనం తినే విషయంలో 80-20 రూల్ ఫాలో అవ్వాలి. బరువు తగ్గాలి అంటే మనకు నచ్చిన ఆహారాలు అన్నింటికీ దూరంగా ఉండమని కాదు.. 80 శాతం ఆరోగ్యకరమైన పోషకాలతో నిండిన ఆహారం తింటే.. 20 శాతం మీకు నచ్చిన ఫుడ్స్ అప్పుడప్పుడు తినొచ్చు. అప్పుడప్పుడు చీట్ మీల్.. మీ బరువు అధికంగా ఏమీ పెంచదు.

6.సంగీతం...


మన వర్కౌట్స్ చేస్తున్న సమయంలో కాసేపటికే బోర్ వచ్చేస్తుంది. అలాంటి సమయంలో మనకు ఎనర్జీ రావడం కోసం మ్యూజిక్ వింటే చాలు. మ్యూజిక్ వింటూ చేయడం వల్ల ఉత్సాహం వస్తుందట. జిమ్ లో పాటలుపెట్టేది అందుకే...

7.ఫోన్లు దూరంగా...


వర్కౌట్స్ చేసే సమయంలో చేతిలో ఫోన్ ఉండకూడదు. ఫోన్ ఉంటే మన ఫోకస్ దానిమీదే ఉంటుంది. డైవర్ట్ అయిపోతారు. అందుకే... ఫోన్లు, టీవీలు లాంటి వాటికి దూరంగా ఉండాలి. అప్పుడు వ్యాయామంపై ఫోకస్ ఉంటుంది.

8.చల్లటి నీటితో స్నానం...


వ్యాయామం తర్వాత అందరూ స్నానం చేస్తారు. అయితే.. ఆ స్నానం వేడి నీటితో కాకుండా.. చల్లటి నీటితో చేయాలి. ఎందుకంటే.. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెటబాలిజం మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.