ఒక అమ్మాయి.. ఒకేసారి ఇద్దరినీ లేదా ముగ్గురిని ప్రేమిస్తే.. ఏమంటారు..? ఆ అమ్మాయి ముగ్గురు అబ్బాయిలను చీటింగ్ చేసింది అని సింపుల్ గా అనేస్తారు. ఆ ముగ్గురు అబ్బాయిలకు చెప్పకుండా చేస్తే.. మోసం అనే ఒప్పుకుందాం. మరి ఆ ముగ్గురికి ఒకరి గురించి మరొకరికి చెప్పి చేస్తే..? దానినే పాలి ఎమరీస్ రిలేషన్ అంటారు.

అర్థం కాలేదా..? ఇప్పడు విదేశాలతోపాటు.. మన దేశానికి కూడా పాకేసిన నయా ట్రెండ్ ఇది. పాలిఎమరీ(Polyamory) అనేది గ్రీక్, లాటిన్ భాషల్లోని రెండు పదాలు కలిసి ఏర్పడింది. పాలీ(గ్రీక్) ఎమోర్(లాటిన్) పదాలు. పాలీ అంటే చాలా లేదా ఒకటి కంటే ఎక్కువ, ఎమోర్ అంటే ప్రేమ. అంటే ఒకరు లేదా ఒకరికంటే ఎక్కువ మందిని ప్రేమించడాన్ని 'పాలీఎమరీ' అంటారు.

పాలిఎమరీకి అత్యంత ముఖ్యంగా ఉండాల్సింది తమ బంధాలలో నిజాయితీ, పారదర్శకత. ఈ బంధంలో ఉన్న ప్రతి పార్ట్‌నర్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉండాలి. అందరి అంగీకారంతో తన బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు.. మరొకరితో ప్రేమలో పడకుండా ఉండగలరా..? ఒకరిని ప్రేమిస్తే.. జీవితాంతం వారితోనే ఉండాలా..? అక్కర్లేదు అని చెప్పడానికే.. ఈ రకం రిలేషన్ ని పరిచయం చేశారు. తమ పాత ప్రేమను వదలుకోకుండానే.. కొత్త ప్రేమకు స్వాగతం చెప్పొచ్చు అంటున్నారు.  దీని కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో గ్రూప్స్ కూడా ఉన్నాయట.

అయితే ఇందులో.. తమ లవర్.. ఇంకొకరితో క్లోజ్ గా ఉన్నా.. ఫీలవ్వడాలు.. బాధపడటం, దాడులు చేయడం లాంటివి చేయకూడదు. చూసీ చూడనట్టు వదిలేయాలి. అలాంటి వారికి మాత్రమే ఈ రకం రిలేషన్ సెట్ అవుతుంది. విదేశాల్లో బాగా పాపులర్ అయ్యింది కానీ... మన దగ్గర చాలా మందికి ఈ రిలేషన్ పెద్దగా నచ్చకపోవచ్చు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ఇది పెద్దగా వర్కౌట్ కాని వ్యవహారం.