Asianet News TeluguAsianet News Telugu

నిద్ర తక్కువైతే.. కోపం ఎక్కువౌతుంది

రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని  ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.

New Iowa State Study Shows Lack of Sleep Intensifies Anger
Author
Hyderabad, First Published Nov 30, 2018, 4:31 PM IST


పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని  ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.  అంతేకాకుండా ఒక నిరాశపూరిత వాతావరణంలో ఉంటారని తెలిపింది. సాధారణంగా అలసిపోయిన వారిలో చికాకు కనిపిస్తుంది. అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందని, అకారణంగా ఎదుట వారిపై విరుచుకుపడతారని ఐయోవా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 

ఈ అధ్యయనం వివరాలను ఎక్స్‌పెరిమెంటల్‌ సైకాలజీ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ మేరకు కొందరిని ఎంపిక చేసి రెండ్రోజులపాటు వారు ఎంతసేపు నిద్రపోవాలో చెప్పి చూశారు. కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే.. నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు, కోపం కనిపించాయని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios