నా అల్లుడి పురుషాంగం పెద్దది.. నా కూతురు తట్టుకోలేక..
తన అల్లుడు పురుషాంగం చాలా పెద్దదని.. అందుకే తట్టుకోలేక తన కూతురు చనిపోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత కేసు ఇండోనేషియాలో చోటుచేసుకుంది.
తన అల్లుడు పురుషాంగం చాలా పెద్దదని.. అందుకే తట్టుకోలేక తన కూతురు చనిపోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత కేసు ఇండోనేషియాలో చోటుచేసుకుంది. కేసు పెట్టడం మాత్రమే కాదు.. అందరిముందు అల్లుడు బట్టలు విప్పి మరీ చూపించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే...ఇండోనేషియాలోని మారోన్ కిదుల్ గ్రామానికి చెందిన నెది సిటో కుమార్తె జుమంత్రి (23) ఉదయం చూసేసరికి మంచంపై శవమై కనిపించింది. దీంతో నెది.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అల్లుడు బర్సాహ్ పురుషాంగం పెద్దది కావడం వల్ల సెక్స్ చేస్తున్న సమయంలో ఆమె తట్టుకోలేక చనిపోయిందని ఆరోపించాడు. దీంతో పోలీసులు బర్సాహ్ పురుషాంగం చూపించాలని కోరారు. సాక్ష్యం కోసం నెది సిటోతోపాటు అతని బంధువులు, గ్రామస్థులకు కూడా దాన్ని చూపించారు.
అయితే.. విచిత్రం ఏమిటంటే.. అతని పురుషాంగం నార్మల్ గానే ఉందని పోలీసులు తేల్చారు. ఆమెకు మొదటి నుంచి మూర్చ వ్యాధి ఉందని.. దాని కారణంగానే చనిపోయిందని వైద్యులు తేల్చారు. వైద్యలు చెప్పిన తర్వాత.. ఆ తండ్రి కూడా కూతురికి మూర్చవ్యాధి చిన్నప్పటి నుంచి ఉందని అంగీకరించాడు. అనవసరంగా అల్లుడిని అవమానించినందుకు క్షమాపణలు కూడా చెప్పాడు.