ఈ మధ్యకాలంలో చేతితో రాసే అలవాటు తగ్గిపోతోంది. అంతా కంప్యూటర్ ప్రపంచం అయిపోయింది. చేతితో రాసే వారే కనిపించడం లేదు.

చిన్నప్పుడు స్కూల్లో క్లాస్ వర్క్, హోం వర్క్ రాసినప్పుడు చేతిరాత బాలేదని, సరిగా రామయని మీకు మీ ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ చెప్పడం గుర్తుందా? అంతెందుకు పరీక్షల్లో చేతిరాత బాగున్నవారికి అదనంగా మార్కులు కూడా వేసేవారు. ఎవరిదైనా హ్యాండ్ రైటింగ్ బాగుంటే వారిని మెచ్చుకోవడం లాంటివి కూడా చూసే ఉంటారు.అయితే.. ఈ మధ్యకాలంలో చేతితో రాసే అలవాటు తగ్గిపోతోంది. అంతా కంప్యూటర్ ప్రపంచం అయిపోయింది. చేతితో రాసే వారే కనిపించడం లేదు.

అయితే, ఈ క్షీణిస్తున్న కళకు జీవం పోసిన బాలిక పేరే ప్రకృతి మల్లా. ఆమె నేపాల్‌కు చెందిన 14 ఏళ్ల చిన్నారి. ఆమె చక్కని, శుభ్రమైన, కళాత్మకమైన చేతిరాత ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకర్షించింది. చాలా మంది ఆమె రాతను చూసి, ఇది కంప్యూటర్‌లో టైప్ చేశారేమోనని అనుకున్నారు!

ప్రకృతి చేతిరాతలో ఉన్న ప్రామాణికత, సమతుల్యత, శుభ్రత, బాహ్య ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది. చేతిరాత ఒక సాధారణ నైపుణ్యం కాదు, అది ఒక కళ.

ఆమె ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తన పాఠశాలలో రాసిన ఒక పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.కంప్యూటర్ లో రాసిన దానిని ప్రింట్ తీసినట్లు.. అన్ని అక్షరాలు సమానంగా, పదానికీ, పదానికీ మధ్య ఖాళీలు కూడా సమానంగా ఉండటం విశేషం. అది చూసినవారు కంప్యూటర్లో రూపొందించిన కాలిగ్రఫీ లా ఉందని అభిప్రాయపడేలా ఆమె నైపుణ్యం ప్రదర్శించడం విశేషం.

ఆమె ప్రతిభను గుర్తించిన నేపాల్ సాయుధ దళాలు ఆమెను ప్రత్యేకంగా సత్కరించాయి. అంతేకాదు, ఆమె UAE 51వ జాతీయ వేడుక కోసం స్వహస్తాలతో అభినందన లేఖను UAE రాయబార కార్యాలయానికి అందించి, తన ప్రతిభను అంతర్జాతీయంగా చాటింది.

ఈ కథ మనందరికీ ఒక గుణపాఠంగా నిలుస్తుంది. డిజిటల్ ప్రపంచంలో తిప్పకర్రగా మారుతున్న మన చేతివ్రాతల అవసరాన్ని మళ్లీ గుర్తు చేస్తుంది. చేతితో రాయడం భావోద్వేగాన్ని, వ్యక్తిత్వాన్ని, సృజనాత్మకతను బయటపెట్టే ప్రక్రియ. అది మన మెదడును మరింత ప్రభావవంతంగా పని చేయించే సాధనం కూడా.

ప్రకృతి మల్లా కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే.. కాలం మారుతున్నా, రచన పరమైన శ్రమకు విలువ ఎప్పుడూ ఉంటుంది.