Asianet News TeluguAsianet News Telugu

మామిడి కూడా అందాన్ని పెంచుతుందా..?

మామిడి పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా అందంగా కూడా చేస్తాయి. 
 

Mango is the best fruit for your skin Know its benefits to get glowing skin rsl
Author
First Published Mar 20, 2023, 1:54 PM IST

మామిడిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ఎ మన చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి మన చర్మం దెబ్బతినకుండా ఉండేందుకు, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది. మామిడిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాలుష్యం, సూర్యరశ్మి నుంచి కాపాడుతాయి. ఇందుకోసం మామిడిని మాస్క్ గా లేదా స్క్రబ్ లాగా ఉపయోగించొచ్చు. లేదా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడటానికి తినొచ్చు. మామిడి పండ్లు మన చర్మానికి ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుుకుందాం.. 

చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది

మామిడి గుజ్జులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది నేచురల్ స్కిన్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మామిడి గుజ్జును చర్మానికి అప్లై చేస్తే చర్మం పొడిబారే అవకాశం తగ్గుతుంది. అలాగే చర్మం మృదువుగా, అందంగా మారుతుంది. 

మొటిమలను నివారిస్తుంది

మామిడిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయగలవు. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతాయి.

చర్మాన్నికాంతివంతంగా చేస్తుంది

మామిడిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. అలాగే నల్ల మచ్చలను తగ్గిస్తాయి. మామిడి గుజ్జును స్కిన్ కు అప్లై చేయడం వల్ల  మీ చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 

డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది

మామిడిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు, వాపును తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ విటమిన్ ఆ ప్లేస్ లో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. 

అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది 

మామిడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముడతలు, సన్నని గీతలతో సహా అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఈ ఫ్రీరాడికల్స్ చర్మ కణాలకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. మామిడి గుజ్జును చర్మానికి అప్లై చేయడం వల్ల దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోకి చొచ్చుకుపోయి అవి దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తాయి. చర్మం యవ్వనంగా, మరింత మృదువుగా కనిపించడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు మామిడిలో ఉండే విటమిన్ ఎ ముడతలను, మచ్చలను తగ్గించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios