Asianet News TeluguAsianet News Telugu

వీడియో వైరల్.. మలైకా అరోరా కేలరీలను ఎలా బర్న్ చేస్తుందో చూడండి..

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఫిట్ నెస్ విషయంలో అస్సలు తగ్గదు. అందుకే ఈ అమ్మడు ఎంత వయసొచ్చినా.. పడుచు పిల్లలాగే కనిపిస్తుంది. ఇక తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొత్త వర్కౌట్ వీడియో వైరల్ అవుతోంది. 
 

Malaika Arora shows you how to burn calories in new workout video
Author
First Published Sep 13, 2022, 9:33 AM IST

మలైకా అరోరా గురించి తెలియని వారుండరు. ఈ బ్యూటీ అందంలో తనకు సాటిలేరు అనిపిస్తుంది. అంతకు మించి ఫిట్నెస్ లో తగ్గేదే లే అన్నట్టుగానే ఉంటుంది. అందుకే బాలీవుడ్ లో ఫిట్నెస్ సెలబ్రిటీలలో ఒకరుగా నిలిచారు. ఈమె ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటుగా యోగాను కూడా చేస్తుంది. అందుకే వయసు మీద పడుతున్నా ఇంకా పడుచుపిల్లలాగే కనిపిస్తుంటుంది. 

ఇకపోతే మలైక తాను చేసే వర్కౌట్స్ ను తరచుగా తన అభిమానులతో పంచుకుంటూ.. వారిని కూడా ప్రోత్సహిస్తూ వస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు నిన్న (సోమవారం) ఇన్ స్టాగ్రామ్ వేధికగా కొత్త వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. ఆ వర్కౌట్ ను రోజూ ఐదు సార్లు చేయమని కూడా అభిమానులకు సలహానిచ్చింది. తను చేసిన ఆ వర్కౌట్ వల్ల కేలరీలు బర్న్ అవడంతో పాటుగా శరీరం కూడా ఫిట్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. 

 

 

Neon green tank top కు మ్యాచింగ్ షార్ట్ వేసుకుని మలైక ఈ వర్కౌట్ ను చేసింది. ‘ ఈ రోజు మేము శరీర బలాన్ని పెంచుదించుకోవడానికి, కేలరీలను బర్న్ చేయడంపై దృష్టి సారిస్తున్నాము. నేను సర్వా (యోగా స్టూడియో) లో నా సెషన్లను స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ వ్యాయామాన్ని రోజూ ప్రాక్టీస్ చేస్తాను’ అని మలైకా క్యాప్షన్ లో రాసుకొచ్చింది. 

ఈ వ్యాయామం పట్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో కూడా మలైకా రాసుకొచ్చింది. ఇది హృదయనాళ ఓర్పును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే శరీర బలాన్ని కూడా పెంచుతుంది. కేలరీలను కూడా కరిగిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ వ్యాయామాన్ని ఫోన్ మాట్లాడుతూ.. టీవీ చూస్తూ కూడా చేయొచ్చని మలైకా తెలిపారు.  ఈ వీడియోను పోస్ట్ చేసిన 3 గంటల్లోనే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios