మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కిడ్నీ వ్యాధులను నయం చేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల ఆహారాలను తింటే మీకు కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశమే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీలు మన శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపుతాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే ఈ పని సక్రమంగా జరుగుతుంది. లేదంటే మన శరీరంలో విషాలు, మలినాలు బాగా పెరిగిపోయి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ ప్రస్తుతం చాలా మంది కిడ్నీ రోగాలతో బాధపడుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. అది ఇతర అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలను తినాలంటే..
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ మన మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది. కాలీఫ్లవర్ యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
బ్లూబెర్రీ
బ్లూబెర్రీల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి తో పాటుగా ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తింటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా కిడ్నీ వ్యాధులు కూడా తగ్గిపోతాయి.
క్యాబేజీ
క్యాబేజీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగున్న కూరగాయ. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీని తింటే గుండె జబ్బులు, మూత్రపిండాల రుగ్మతలు తగ్గిపోతాయి.
పైనాపిల్
పైనాపిల్ కూడా ఎన్నో రకాల వ్యాధులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీ రోజు వారి ఆహారంలో పైనాపిల్ ను చేర్చుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే పైనాపిల్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
రెడ్ క్యాప్సికం
రెడ్ క్యాప్సికమ్ లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కూరగాయ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ఆపిల్
రోజుకో ఆపిల్ ను తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సామేత చాలా మందికి తెలిసే ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆపిల్స్ ను రోజూ తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
