Independence Day 2023: ఎన్నో ఏండ్ల పోరాట ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవం. భారత దేశానికి స్వాతంత్య్రం రావడం కోసం ఎందరో మహానుభావులు నేలకొరికారు. బ్రిటీషర్లతో అలుపెరుగని పోరాటంలో కనుమరుగయ్యారు. ఇలాంటి రోజు గురించి కొన్ని వాస్తవాలు మీకోసం..

Independence Day 2023: 1858 నుంచి 1947 వరకు మనదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. అయితే బ్రిటీషర్లు భారతదేశంపై ఆధిపత్యం చూపించడానికి రెండు పద్దతులను ఎంచుకున్నారు. ఒకటి.. యుద్దాలు చేసి భూభాగాలను ఆక్రమించుకోవడం. రెండు.. భారతరాజ్యాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి సైన్య సహకార పద్దతిని అవలంభించడం. వీటితో బ్రిటీషర్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. మన దేశాన్ని ఎంతో దోచుకున్నారు. వర్తకులుగా బతకడానికి వచ్చి దేశ పాలనను వారి చేతుల్లోకి తీసుకుని మనల్ని ఏలారు. వారి ఆగడాలకు విసిగిన ఎందరో మహానుభావులు స్వాతంత్ర్యం కోసం అలుపెరుగకుండా పోరాటం చేశారు. ప్రాణాలు అర్పించారు. బ్రిటీష్ తుటాలకు నేలకొరిగారు. ఎన్నో ఏండ్ల పోరాటం వల్లే 15 ఆగస్టు 1947 న భారతదేశం 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందింది. స్వాత్రంత్యాన్ని సంపాదించుకుంది. స్వాతంత్ర్య సమరయోధుల అపారమైన ధైర్యసాహసాలు, త్యాగాలే బ్రిటీష్ వారిని గద్దె దించి దేశాన్ని విముక్తం చేసాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. దీని గురించి కొన్ని వాస్తవాల గురించి మాట్లాడుకుందాం.. 

1. 1857లో మొదటి స్వాతంత్ర్య పోరాటం జరిగింది. దీనిని సిపాయి తిరుగుబాటు అని, 1857 భారత తిరుగుబాటు అని కూడా అంటారు. దీనికి మంగళ్ పాండే నాయకత్వం వహించారు.1857 లో బ్రిటీష్ సైనికులకు వ్యతిరేకంగా ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి, బహదూర్ షా జాఫర్, తాత్యా తోపే, నానా సాహిబ్ లు ప్రతిఘటనకు నాయకత్వం వహించారు.

2. ఇక ఆ తర్వాత 1900వ దశకంలో స్వదేశీ ఉద్యమం మొదలైంది. అయితే స్వదేశీ వస్తువులను బహిష్కరించడానికి, విదేశీ వస్తువులను బహిష్కరించడానికి బాలగంగాధర్ తిలక్, జె.ఆర్.డి.టాటా లు బొంబాయి స్వదేశీ కో-ఆపరేటివ్ స్టోర్స్ కంపెనీ లిమిటెడ్ ను స్థాపించారు. దీనికి మహాత్మాగాంధీ స్వయం పాలనకు ఆత్మగా అభివర్ణించారు.

3. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల మూడు సమాంతర గీతలతో కూడిన మన జాతీయ పతాకాన్ని 1906 ఆగస్టు 7 న కోల్కకతా లోని పార్సీ బగాన్ స్క్వేర్ లో ఎగురవేశారు. అయితే ప్రస్తుతం మన జాతీయ పతాకం మొదటి రూపాన్ని పింగళి వెంకయ్య 1921 లో రూపొందించారు. అయితే ఆరెంజ్ , తెలుపు, ఆకుపచ్చ చారలతో కూడిన ప్రస్తుత జెండాను అధికారికంగా స్వీకరించి 1947 ఆగస్టు 15న ఎగురవేశారు.

4. భారతదేశంలో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాలని కోరుతూ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో.. 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. 

5. మీకు తెలుసా? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనకు అధికారిక జాతీయ గీతం లేదు. 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన 'భరోతో భాగ్యయో బిధాతా' పాటను 'జన్ గన్ మాన్'గా నామకరణం చేశారు. దీనిని భారత రాజ్యాంగ సభ 1050 జనవరి 24 న జాతీయ గీతంగా ఆమోదించింది.

6. అయితే భారతదేశం అనే పేరు సింధు నది నుంచి వచ్చిందని నమ్ముతారు. ఇది నది ఉపనదుల మధ్య వర్ధిల్లిన గొప్ప సింధు లోయ నాగరికతకు సాక్ష్యంగా నిలుస్తుంది.

7. 15 ఆగస్టు 1947 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కొరియా, కాంగో, బహ్రెయిన్, లైచెన్స్టెయిన్ దేశాలు కూడా ఇదే రోజున తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారత్ తో పంచుకుంటాయి.

8. అయితే బంకించంద్ర ఛటర్జీ స్వరపరిచిన భారత జాతీయ గీతమైన 'వందేమాతరం' 1880వ దశకంలో ఆయన రాసిన 'ఆనందమఠ్' నవలలో ఒక భాగం. వందేమాతరంను 1950 జనవరి 24 న జాతీయ గీతంగా స్వీకరించారు.

9. భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ఆగస్టు 15 అర్ధరాత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో.. ఇలా అన్నారు. "చాలా సంవత్సరాల క్రితం మేము విధితో ఒక ప్రయత్నం చేసాము. ఇప్పుడు మన ప్రతిజ్ఞను నెరవేర్చే సమయం వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్నప్పుడు భారతదేశం జీవితం, స్వేచ్ఛ కోసం మేల్కొంటుంది.