Health Tips: చక్కెర కంటే తేనెనే ఎంతో మేలని అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది చక్కెరకు బదులుగా తేనెను తింటున్నారు. అయితే తేనెను అతిగా తీసుకుంటే అనేక సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
Health Tips: శరీర ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు, కేశాల నిగారింపుకు తేనే దివ్య ఔషదంలా పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది చక్కెరకు బదులుగా తేనెను తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ప్రాసెస్ లో అవసరానికి మించి తేనెను ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తంలో చక్కెర స్థాయిలు: తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ తేనెను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి తేనెను పరిమితంగానే తీసుకోవాలి.
బరుపు పెరగడం: గోరు వెచ్చని నీళ్లలో టీస్పూన్ తేనె వేసుకుని తాగితే బరువు తగ్గుతారని అందరికీ తెలిసిందే. అది పూర్తిగా నిజం కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే చక్కెర కంటే తేనె తక్కువ తీపిని కలిగున్నా.. తేనె కూడా బరువును పెంచడం పక్కాగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
జీర్ణక్రియ: మోతాదుకు మించి తేనెను తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు దీనివల్ల కడుపు నొప్పి సమస్య కూడా రావొచ్చు. అలాగే డయేరియా, ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దంతాలు: తేనెను ఎక్కువ మొత్తంలో తరచుగా తీసుకోవడం వల్ల నోటిలో చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశముందట. దాంతో ఆ బ్యాక్టీరియా దంతాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని కారణంగా నోటినుంచి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంది.
రక్తపోటు: రక్తపోటు సమస్యతో బాధపడేవారు తేనెకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే తేనెతో రక్తపోటు మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
