cancer symptoms: మనిషి ప్రాణాలను అలవోకగా తీసే భయంకరమైన రోగాలలో క్యాన్సర్ కూడా ఒకటి. దీని బారిన పడితే మనం జీవితం మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందులోనూ ఈ వ్యాధి సోకితే.. మనకు ఈ రోగం ముదిరాకనే తెలుస్తుంది. అప్పటికీ మన ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలలో మరో కొత్త లక్షణాన్ని పరిశోధకులు గుర్తించారు. 

cancer symptoms: ప్రమాదకరమైన రోగాలలో ఒకటైన క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెబుతోంది. ఈ భయంకరమైన జబ్బు బారిన పడితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ఈ మహమ్మారి ఒక కణంలో చిన్న పుండుగా తయారై.. దశల వారిగా పెద్దదై.. రోగం ముదురుతుంది. ఈ రోగం ముదిరాకనే దీని లక్షణాలు కనిపిస్తాయి. ఆ సమయంలో కణాలు విపరీతంగా పెరగుతాయి. దాని నియంత్రణ అనేదే లేనంతగా. దీనివల్ల శరీర అవయవాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆ సమయంలో చికిత్స చేయడం కష్టతరమైనదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ రోగం ఒకసారి తగ్గితే.. తిరిగి మళ్లీ వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ రోగం అతి భయంకరమైనది.

క్యాన్సర్ రకాలల్లో ఎక్కువగా బ్రెస్ట్, ప్రొస్టేట్, పెద్దపేగు వంటివే ఎక్కువగా సోకుతున్నాయట. కాగా ఇప్పటివరకున్న క్యాన్సర్ లక్షణాలు మీకు తెలిసిందే. అయితే తాజాగా క్యాన్సర్ కొత్త లక్షణాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ లక్షణం సర్వ సాధారణంగానే ఉంటుందట. అందుకే దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదట. కానీ ఈ లక్షణాన్ని అంత తేలిగ్గా తీసిపారేయాల్సింది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏమిటా లక్షణం: ఉదయం లేచిన వెంటనే ఎలా ఉంటారు. రీ ఫ్రెష్ గా, ఉత్సాహంగా. కానీ కొంతమందిలో మాత్రం ఇవి కనిపించడం లేదట. వీరికి తీవ్రమైన దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం వంటి సమస్యలు పొద్దు పొద్దున్నే వేధిస్తుంటాయి. వీటిని తేలిగ్గా వదిలేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవి క్యాన్సర్ లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు మార్నింగ్ లేచిన వెంటనే అలసట, దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఒక్కోసారి మనలో ఉన్న క్యాన్సర్ వల్ల కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

రెండు వారాల నుంచీ మార్నింగ్ లేవగానే గొంతునొప్పి సమస్య వేధిస్తుంటే కాడా దాన్ని క్యాన్సర్ గానే అనుమానించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా స్మోకింగ్ చేసే అలవాటున్న వారికి క్యాన్సర్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. 

క్యాన్సర్ ఎందుకొస్తుంది:  World Health Organization ప్రకారం.. ఈ కారణాల వల్లే క్యాన్సర్ వస్తుంది. స్మోకింగ్ చేయడం, మద్యం సేవించడం, వారసత్వంగా (Genealogy), Ionizing radiation‌ కు గురవ్వడం, క్యాన్సర్ కారకాలైన వైరస్ లు సోకడం, జన్యువుల మూలంగా, రసాయన క్యాన్సర్ కారకాల మూలంగా వంటి కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది.

దీన్ని ఎలా అడ్డుకోవాలి: వారసత్వంగా సోకే క్యాన్సర్ల ను అడ్డుకోవడం కష్టం. అది వైద్యుల వల్ల కూడా కాదు. బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్ వల్ల వచ్చే క్యాన్సర్లను రాకుండా అడ్డుకోవచ్చు. ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం, ప్రెష్ కూరగాయలను, పండ్లను తింటూ ఉండాలి. అలాగే చికెన్, ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల కూడా ఈ క్యాన్సర్ ను అడ్డుకోవచ్చు. బయటి ఫుడ్ ను తీసుకోకూడదు. ఇంట్లో వండిప ఆహారాన్నే తినండి. వీటివల్లే మీరు ఈ మహమ్మారి బారిన పడకుండా ఉంటారు.