ఎదిగే పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి..?
సరైన వయసులో సరైన ఆహారం తీసుకోకపోతే.. దాని ప్రభావం పిల్లల ఎదుగుదలపై పడుతుంది. దీంతో.. శారీరకంగా.. మానసికంగా వారిలో ఎదుగదల లోపిస్తూ ఉంటుంది.
దాదాపు పిల్లలందరూ ఆహారం విషయంలో మొండికేస్తూనే ఉంటారు. ఏది పెట్టాలన్నా.. బలవంతంగా పెట్టాల్సిందే. తినరులేని అని వదిలిస్తే.. చాలా సమస్యలు ఎదురౌతాయి. సరైన వయసులో సరైన ఆహారం తీసుకోకపోతే.. దాని ప్రభావం పిల్లల ఎదుగుదలపై పడుతుంది. దీంతో.. శారీరకంగా.. మానసికంగా వారిలో ఎదుగదల లోపిస్తూ ఉంటుంది. అసలు ఎదిగే పిల్లలకు అందించాల్సిన విటమిన్స్ ఏంటి..? ఏ ఆహారంలో వారికి సరపడా పోషకాలు, విటమిన్స్ అందుతాయో.. ఇప్పుడు చూద్దాం...
విటమిన్ ఏ... చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి విటమిన్ ఏ చాలా అవసరం. ఎముక బలానికి, కంటి చూపు మెరుగుపడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ చీజ్, క్యారెట్, పాలు, గుడ్లూ, ఆకుకూరల్లో పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ బి... పిల్లలు చురుగ్గా ఉండేందుకు ఈ విటమిన్ చాలా అవసరం. మాంసం, చేపలు, సోయా, బీన్స్ లాంటి ఫుడ్స్ లో బి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ సి.. అందమైన చర్మానికీ, శారీరక దృఢత్వానికీ విటమిన్ సీ చాలా అవసరం. టమాటాలు, తాజా కూరగాయలు ఆరెంజ్, నిమ్మ వంటి పండ్లలో ఉంటాయి.
విటమిన్ డి... ఎముకలు బలంగా ఉండాలంటే సరిపడ కాల్షియం శరీరానికి అందాలి. పాలు, పెరుగు వంటి ఉత్పత్తులు పిల్లలకు అందించాలి. సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఐరన్... ఐరన్ శరీరంలోని రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. పాలకూర, ఎండుద్రాక్ష, ఖర్జూర వంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్స్ అన్నీ పుష్కలంగా అందించగలిగితే... పిల్లల్లో ఎదుగదల మెరుగ్గా ఉంటుంది