ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడానికి ఇదొక్కటే కారణమని లేదు. ఎందుకంటే జుట్టు రాలడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే కొంతమందికి తడి జుట్టును కూడా దువ్వే అలవాటుంటుంది. అసలు ఇది మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?
మనం తినే ఆహారం, జీవన శైలి, మన అలవాట్లు, కాలుష్యం, జబ్బులు, మందులు ఇలా ఎన్నో జుట్టును ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఇవే జుట్టు విపరీతంగా రాలేలా చేస్తాయి. అంతేకాదు చిన్న వయసులో వెంట్రుకలను తెల్లగా మార్చేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా.. పొడుగ్గా, ఒత్తుగా పెరగాలన్నా జుట్టు సంరక్షణ చిట్కాలను ఫాలో కావాలి. లేదంటే చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంది. నెత్తి పల్చగా అవుతుంది.
అయితే చాలా మంది జుట్టు పచ్చిగా ఉండగానే దువ్వుతుంటారు. కానీ తడి జుట్టును అస్సలు దువ్వకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తడి జట్టును దువ్వితే జుట్టు మూలాలు బలహీనపడతాయి. దీనివల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది.
తడి జుట్టును దువ్వడం వల్ల కలిగే నష్టాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తడి జుట్టును పొరపాటున కూడా దువ్వకూడదు. ఎందుకంటే జుట్టును శుభ్రం చేయడం వల్ల మూలాలు బలహీనంగా మారతాయి. ఇలాంటి సమయంలో జుట్టును దువ్వితే అవి సులువుగా ఊడిపోతాయి. అందుకే జుట్టు పూర్తిగా ఆరిపోయిన తర్వాతే దువ్వాలి. తడి జుట్టును దువ్వడం వల్ల జుట్టు మూలాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది హెయిర్ ఫాల్ కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడు దువ్వాలి?
తలస్నానం చేసిన తర్వాత నెత్తిలో వాటర్ అలాగే ఉంటాయి. ఇవి ఆరిపోవడానికి కాస్త సమయం పడుతుంది. తలస్నానం చేసిన వెంటనే వెంట్రుకలను దువ్వకూడదు. ఆరిన తర్వాత దువ్వినా మీరు ఉపయోగించే దువ్వెన దంతాలు మందంగా ఉండాలి. మీ జుట్టు ఎంత పొడవున్నా.. పై నుంచి చివర్ల వరకు దువ్వాలి. కానీ ఒకేసారి జుట్టు చివర్ల వరకు దువ్వాలని రూల్ ఏమీ లేదు. దీనివల్ల మీ జుట్టు తెగిపోయే, ఊడిపోయే ప్రమాదం తగ్గుతుంది.
రోజుకు ఎన్ని సార్లు దువ్వాలి?
తడి జుట్టును ఎట్టి పరిస్థితిలో దువ్వకూడదు. జుట్టు పూర్తిగా ఆరిపోయిన తర్వాతే జుట్టును దువ్వాలి. ఆ తర్వాత నూనెను జుట్టంతా పెట్టాలి. ఇలా చేయడం వల్ల నూనె జుట్టు మూలాలకు చేరుతుంది. నూనె మీ జుట్టుకు కావాల్సిన పోషణను అందిస్తుంది. దీంతో మీ జుట్టు బలంగా మారుతుంది. పొడుగ్గా పెరుగుతంది. మీ జుట్టు బలంగా పెరగాలంటే రోజుకు 2 నుంచి 3 సార్లు దువ్వండి. ఇలా చేస్తే మీ వెంట్రుకలు స్ట్రాంగ్ గా ఉంటాయి.
