షేవింగ్ వల్ల ముఖ చర్మం బాగా ప్రభావితమవుతుంది. షేవింగ్ చేసిన తర్వాత ముఖంపై దురద పెడుతుంది. మొటిమలు ఏర్పడతాయి. మచ్చలు వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. 

పురుషులు వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ముఖాన్ని షేవ్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షేవ్ చేసుకుంటే ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చేవ్ చేయకపోతే అందులో దుమ్ము, దూళి, క్రిమి కీటకాలు చేరే అవకాశం ఉంది. వీటివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకే షేవ్ ను ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తారు. అయితే చాలా సార్లు షేవ్ చేసుకోవడం వల్ల ముఖ చర్మం ఎంతో ప్రభావితం అవుతుంది. అంటే షేవ్ చేసిన తర్వాతం ముఖంపై దద్దుర్లు ఏర్పడటం, దురద పెట్టడం, మొటిమలు కావడం, మచ్చలు వంటి సమస్యలు వస్తాయి. 

ఇలా ఎందుకు జరుగుతుంది?

షేవింగ్ చేసిన తర్వాత ముఖంపై ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చర్మం చాలా పొడిగా ఉన్నవారికే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే షేవింగ్ కోసం ఉపయోగించే బ్లేడ్, షేవింగ్ చేసే పద్ధతి, షేవింగ్ కు ముందు లేదా తర్వాత ముఖానికి పెట్టే ఇతర ఉత్పత్తులన్నీ షేవింగ్ తర్వాత ఎన్నో సమస్యలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

అయితే కొంతమందికి షేవింగ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ సమస్యలు కనిపిస్తాయి. ఇంకొంతమందికి రెండు లేదా మూడు రోజుల తర్వాత ఈ సమస్యలు వస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్టుగా షేవింగ్ తర్వాత సాధారణంగా మొటిమలు, చిన్న చిన్న కురుపులు, దురద, మచ్చలు వంటి సమస్యలు వస్తాయి.

చేయాల్సిన పనులు

షేవింగ్ తర్వాత చర్మపు చికాకు అలాగే ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. వీటిలో ముఖ్యమైనది పొడి చర్మం ఉన్నవారు షేవింగ్ కు ముందు చర్మాన్ని కొద్దిగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. 12 గంటల ముందే మాయిశ్చరైజర్ రాసుకుని చర్మాన్ని శుభ్రం చేసుకుంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

షేవింగ్ చేసేటప్పుడు ఈ సమస్యలు ఎప్పుడూ ఉంటే .. అప్పుడు షేవింగ్ సెట్ ను మార్చండి. అలాగే ఇతర ఉత్పత్తులను కూడా ఖచ్చితంగా మార్చండి. అయినా సమస్యలు అలాగే కొనసాగితే షేవింగ్ పై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. అంటే షేవింగ్ చేసేటప్పుడు ముందుగా పొడుగ్గా ఉండే వెంట్రుకలను కత్తిరించి.. ఆ తర్వాత షేవింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే చర్మ సమస్యలు రావు. 

అయితే వెంట్రుకలను చర్మంలోంచి లాగడానికి ప్రయత్నించకండి. అలాంటి వెంట్రుకలను పొట్టిగా కత్తిరించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే లోపలికి లోతుగా వెళ్లిన వెంట్రుకలను బయటకు తీసినప్పుడు కోసుకుపోయే అవకాశం ఉంది. ఇది ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ముఖ్యంగా స్కిన్ ప్రొడక్ట్స్ వెంట్రుకల రంధ్రంలోకి ఇన్ఫెక్షన్లు పక్కాగా వస్తాయి.

షేవింగ్ క్రీములను ఖచ్చితంగా వాడాలని నిపుణులు చెబుతున్నారు. సబ్బు లేదా షవర్ జెల్ ను అసలే ఉపయోగించకూడదు. మీరు చాలా కాలంగా షేవ్ చేయకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తర్వాత షేవింగ్ చేసేటప్పుడు చర్మానికి ఇబ్బంది కలుగుతుంది.