పీరియడ్స్ క్రమం తప్పకుండా ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. ఇది అమ్మాయిలను ప్రతి నెలా ఇబ్బంది పెట్టే సమస్యే. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ రాబోతోంది అంటే... ఆ సమయానికి పీరియడ్స్ అయిపోతాయా లేదా అని లెక్కలు వేసుకుంటారు. ఎందుకంటే... పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు అంత కంఫర్ట్ గా ఉండలేరు. అందుకే ఆ సమయంలో దాదాపు ఫంక్షన్లు, పార్టీలకు డుమ్మా కొట్టేస్తారు. అయితే... ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు నిపుణులు.. 

పీరియడ్స్ వచ్చాయంటే చాలు.. ముందు కడుపులో ఉబ్బరంగా ఉండటం. ఏది తిన్నా అసౌకర్యంగా ఉండకపోవడం, కడుపునొప్పి రావడం లాంటివి జరుగుతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటేల పొటాషియం ఎక్కువగా ఉండే అరటి, బొప్పాయి లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక నొప్పి తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ ముందుగానే దగ్గరపెట్టుకోవడం ఉత్తమం

ఈ సమయంలో ప్యాడ్స్ కంటే మెనుస్ట్రువల్ కప్స్ ఉపయోగించడం మంచిది. అవకాశం ఉంటే.. వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి. వీటికి బదులుగా టాంఫూన్స్ అయినా వాడొచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా  పార్టీ టైం ఎంజాయ్ చేయచ్చు.

టాంఫూన్స్, మెనుస్ట్రువల్ కప్స్ ఇప్పటి వరకూ మీరు ఉపయోగించనట్లయితే.. వాటికి బదులుగా హెవీ డ్యూటీ ప్యాడ్స్ ఉపయోగించవచ్చు. లేదా ఒక ప్యాడ్‌కి బదులుగా రెండు ప్యాడ్స్ వాడండి. ఇలా చేయడం వల్ల మీ దుస్తులకు మరకలు అవుతాయనే భయం ఉండదు.

ఒక్కో నెల కొందరి సాధారణం కంటే ఎక్కువగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారు ముందు జాగ్రత్త కోసం ఒక ప్యాడ్ ఎక్స్ ట్రా పెట్టుకోవడం ఉత్తమం. వీలైనంత వరకు ఎక్కువ సార్లు వాష్ రూం కి వెళ్లడం లాంటివి చేయడం మంచిది.

ఇక పీరియడ్స్ సమయంలో హై హీల్స్ వాడటం అంత మంచిదేమీ కాదు. వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం. హైహీల్స్ వాడటం వల్ల కాళ్ల నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మంచినీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇక పీరియడ్స్ సమయంలో అనవసరంగా టెన్షన్లు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.