మడమలు పగిలాయా? ఇలా చేసారంటే తొందరగా తగ్గిపోతాయి

చాలా మందికి మడమలు పగిలిపోయి ఉంటాయి. కొందరికైతే ఏకంగా ఈ పగుళ్ల నుంచి రక్తం కారుతుంటుంది. పాదాల పరిశుభ్రత సరిగ్గా లేకపోతేనే మడమలు పగులుతాయి. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయ్యారంటే ఈ పగుళ్లు తొందరగా తగ్గిపోతాయి. 

How to heal cracked feet overnight rsl

మడమల పగుళ్ల సమస్య ఎక్కువగా ఆడవాళ్లకే ఉంటుంది. కానీ దీనివల్ల మడమల నుంచి రక్తం కారడం, నడుస్తున్నప్పుడు విపరీతమైన నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అయితే ఆడవాళ్లు ముఖ సౌందర్యంపై పెట్టే ఇంట్రెస్ట్ పాదాల విషయంలో అస్సలు పెట్టరు. ముఖం అందంగా కనిపించడానికని ఆడవాళ్లు ఎంతో కేర్ తీసుకుంటారు. కానీ కాళ్లు, పాదాల విషయంలో మాత్రం తీసుకోరు. దీనివల్లే మడమలు పగుళుతాయి. మడమలు పగలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ పాదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మడమలు పగిలే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. మరి పగిళిన మడమలు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గ్లిజరిన్

మడమల పగుళ్లు నయం కావడానికి, పాదాలు అందంగా కనిపించేలా చేయడానికి గ్లిజరిన్ బాగా ఉపయోగపడుతుంది. గ్లిజరిన్ పాదాల చర్మాన్ని తేమగా చేస్తుంది. మడమల పగుళ్లకు గ్లిజరిన్ పూయడం వల్ల అవి తొందరగా నయమవుతాయి. 

దీన్ని ఎలా ఉపయోగించాలంటే? 

గ్లిజరిన్ ను తీసుకుని దాంట్లో రోజ్ వాటర్ మిక్స్ చేయండి. మీ పాదాలను నీట్ గా కడిగి ఈ గ్లిజరిన్ మిశ్రమాన్ని మడమల పగుళ్లకు అప్లై చేయండి. 20 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత పాదాలను కడిగి పొడి గుడ్డతో తడి లేకుండా తుడవండి. 

తేనె

తేనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని మనం మడమల పగుళ్లను నయం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. ఇది పగుళ్లను నయం చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తేనె బెస్ట్ మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది.  తేనెలో ఉండే అన్ని గుణాలు మన ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయి. 

దీన్ని ఎలా ఉపయోగించాలంటే? 

ఒక బకెట్ గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. ఈ నీళ్లలో తేనె వేసి కలపండి. ఆ తర్వాత మీ పాదాలను ఈ వాటర్ లో ముంచండి. 20 నిమిషాల తర్వాత మీ పాదాలను కడుక్కుంటే సరిపోతుంది. అయితే ఈ చిట్కాలను మీరు వారానికి మూడు రోజులు మాత్రమే ఫాలో అవ్వాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios