అతిగా చేస్తే ఏదైనా అనర్థమే.. అది ఏ విషయంలోనైనా కావచ్చు. మితంగా ఉన్నంత వరకు ఏదైనా బాగుంటుంది. అతికి పోతే అనార్థాలే మిగులుతుంటాయి. ఇవి చేసే పనుల విషయంలోనో... మన ప్రవర్తన విషయంలోనే మాత్రమే కాదు. వాడే వస్తువుల విషయంలో కూడా ఇదే సూత్రం అమలులోకి వస్తుంది.

కొందరికో అలవాటు ఉంటుంది. దేనినీ తర్వగా పడేయడానికి ఇష్టపడరు. సంవత్సరాల కొద్దీ అదే వస్తువుని వాడుతూ ఉంటారు. పైగా ఆ విషయం అందరికీ చెప్పి... మురిసిపోతుంటారు కూడా. అయితే... ఈ సంతవ్సరాల కొద్దీ వాడే వస్తువుల్లో కొన్ని మాత్రం అస్సలు ఉండకూడదంటున్నారు నిపుణులు.

వాటిలో మొదటిది దిండు. చాలా మంది ఇంట్లో పెద్దవాళ్లు పాడైనా కూడా దిండ్లు, దుప్పట్లు లాంటివి పడేయడానికి ఇష్టపడరు. పర్వాలేదులే పడేయడం ఎందుకు అంటూ.. ఉంచేసి వాడోస్తూ ఉంటారు. అయితే... ఇది ఎంత వరకూ మంచిది కాదంటున్నారు వైద్యులు. దిండును ఏళ్ల కొద్దీ వాడితే మెడ, తల నొప్పి వస్తాయంటున్నారు వైద్యులు. దీనిలో ఉండే దూది, ఫోమ్ వంటివి ఎగుడుదిగుడుగా మారి ఈ సమస్యకు కారణం అవుతాయి. కనీసం రెండేళ్లకొకసారైనా వీటిని మార్చేయాల్సిందే.

టూత్ బ్రష్. రోజూ దంతాలు క్లీన్ చేసుకునే బ్రష్ ని చాలా మంది రంగు మారినా, కుచ్చులే ఊడినా, వంకరపోయినా.. అంతే వాడేస్తూ ఉంటారు. కానీ వీటిని కనీసం మూడు నెలలకు ఒకసారైనా మార్చాల్సిందే. లేందంటో నోరు వాసన రావడం, చిగుళ్లకు గాయం కావడం.. పళ్లు పాడైపోవడం జరుగుతుంటాయి.

దువ్వెన... వీటిని కూడా సంవత్సరాలపాటు వాడే మంది చాలా మందే ఉంటారు. ఎందుకంటు తొందరగా పాడు కావు కదా అనేది సమాధానం. అయితే... వీటిని కనీసం పది రోజులకి ఒకసారైనా శుభ్రం చేయాలి. అది కూడా వేడినీటితో చేయాలి. అంతేకాదు.. సంవత్సరానికి మించి కూడా వాడకూడదు. ఇలా వాడటం వల్ల జట్టు తెగిపోవడం, మాడుకి గాయాలు కావడం లాంటివి జరుగుతుంటాయి.

ఇక చివరగా అత్యంత ముఖ్యమైనది లో దుస్తులు. ఇవి శరీరానికి అతుక్కొని ఉండటం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. కనీసం ప్రతి ఆరునెలలకు ఒకసారైనా వీటిని మార్చకపోతే అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.